iDreamPost

భారం ‘బీసీ’ల మీదికే

భారం ‘బీసీ’ల మీదికే

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాజకీయ చతురుడు అంటుంటారు. అయితే ఆయన చతురత ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడింది అంటే సూటి సమాధానం దక్కిదు కానీ, ఆయనకు మాత్రం తప్పకుండా తోడ్పడిందనే చెబుతుంటారు. దాదాపు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న అన్ని సంక్షోభాల సమయంలోనూ ఇటువంటి చర్చ గతంలో కూడా జరుగుతూనే ఉండేది. అయితే ఈ సారి ఆ పార్టీ ఎదుర్కొంటున్నంతటి సంక్షోభం గత చరిత్రలో ఎప్పుడూలేదన్నది విశ్లేషకులు చెప్పే మాట.

అన్నీ బాగున్నప్పడు తాను, తన కుమారుడు పదవుల్లో ఉండి, పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యాక ఎవరొకరికి అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యంపైనే ఇప్పుడు జనం ఆక్షేపిస్తున్నారు. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యలు అచ్చెంనాయుడికి అప్పగిస్తారన్న ప్రచారం విసృతంగా సాగుతోంది. అయితే ఇది చంద్రబాబు సై్టల్‌ లీకుల స్ట్రాటజీ అయినా ఆశ్చర్చపోనక్కర్లేదు. ముందుగా లీక్‌చేసి తనక్కావాల్సిన సమాచారాన్ని సేకరించుకోవడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యే. ఈ నేపథ్యంలో అచ్చెన్న పేరును లీక్‌ చేసారన్న ఆదన కూడా లేకపోలేదు.

అచ్చెన్నే అయినా, ఇంకొక నేత అయినా పార్టీ ఇప్పుడున్న క్లిష్టపరిస్థితుల్లో బాధ్యలు అప్పగించడం ద్వారా వారి పరిస్థితిని మరోమెట్టు క్రిందికి లాగేయడమే తప్ప, ఉపయోగం ఏం ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. నందమూరి తారకరామారావు టైమ్‌ నుంచీ కూడా ఆ పార్టీకి బీసీలు వెన్నుదన్నుగానే ఉన్నప్పటికీ వారికి జరిగిన న్యాయంపై సదరు వర్గం నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి కారణంగానే ఇతర పార్టీలవైపు వారు మరలేవిధంగా పురిగొల్పిందన్నది విశ్లేషకుల భావన. అయితే ఇటువంటి లోపాలను ఒప్పుకోకుండా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకోవడం వెనుక సహేతుక కారణాలు కన్పించవు.

ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర టీడీపీనీ ప్రక్షాళన చేయాలని అక్కడి సీనియర్‌ నాయకులు లేఖరాసేంత వరకు తెచ్చుకున్నారు. అదే రీతిలో ఏపీలో కూడా లేఖలు గట్రా రాస్తే ఉన్న పరువుకాస్తా బంగాళాఖాతం పాలయ్యే ప్రమాదం ఊహించే అచ్చెన్నను తెరమీదికి తీసుకువస్తున్నారన్న వాదన కూడా లేకపోలేదు.

అన్నీ బావుంటే మేమే ఉంటాం.. బాగోలేక పోతే ఎవరో ఒకరికి అప్పగిస్తాం.. లాంటి చంద్రబాబు సై్టల్‌ స్ట్రాటజీని జనం ఏ విధంగా అర్ధం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి