iDreamPost

నిన్న కుప్పం, నేడు చిత్తూరు – చిటింగ్ కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు పీఏ

నిన్న కుప్పం, నేడు చిత్తూరు – చిటింగ్ కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు పీఏ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పీఏ మనోహర్‌ నకిలీ లబ్ధిదారుల పేర్లు మీద భారీగా లోను తీసుకొని బ్యాంకు ని మోసం చేశాడని చిత్తూరు టౌన్ బ్యాంకు చైర్మన్, వైసీపీ నేత విద్యాసాగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు కో ఆపరెటివ్ బ్యాంకు లో ఉన్న తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఫిక్సిడ్ డిపాజిట్లపై రూ.12 లక్షలు లోన్ తీసుకుని వాటిని మనోహర్ స్వాహా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నకిలీ ధృవ పత్రాల తో తన మనుషుల ద్వారా అక్రమంగా చంద్రబాబు పీ.ఏ లోన్లు తీసుకున్నారని బ్యాంకు అధికారుల ఆడిటింగ్ లో తేలింది. ప్రాధమిక విచారణ లో దీనిలో స్కాం జరిగినట్టు బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా ఈ చిత్తూరు కో ఆపరెటివ్ బ్యాంక్ వ్యవహారం కంటే ముందే కుప్పం టౌన్ బ్యాంకులో కుడా కోటి 90 లక్షల భారీ స్కాం జరిగింది. చంద్రబాబు పీఏ మనోహర్ సిఫార్సు పై కొందరు ప్రముఖులు కుప్పం కో ఆపరెటివ్ బ్యాంక్ లోని ఫిక్సిడ్ డిపాజిట్‌లపై లోన్లు తీసుకుని స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తంలో బ్యాంకు సిబ్బంది చేతివాటం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మేనేజర్, అప్రయజర్ మరో ఇద్దరు సిబ్బందితో కలిసి స్కాంకు పాల్పడినట్లు సమాచారం. దీంతో నలుగురిని సస్పెండ్ చేసిన అధికారులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పీఏ మనోహర్ పై వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు చిత్తూరు పియస్ లో మనోహర్ పై సెక్షన్ 420, 468, 471 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా కేవలం రాజకీయ కక్ష తోనే వైసిపి నేతలు కావాలనే తనని అన్యాయంగా కేసులో ఇరికించారని మనోహర్ ఆరోపిస్తున్నారు. ఎదేమైనా నిన్న ఈరోజు కుప్పం.. చిత్తూరు కో ఆపరెటివ్ బ్యాంకులలో వరుసగా స్కాం బయటపడటం.. దీనిలో స్వయాన మాజి ముఖ్యమంత్రి పీఏ ప్రమేయం ఉందని వార్తలు రావడంతో అటు చిత్తూరు జిల్లా తో పాటు రాష్టవ్యాప్తంగా ఇప్పుడు ఈ బ్యాంక్ స్కాం వ్యవహారం సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి