iDreamPost

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం! తెలుగు రాష్ట్రాల నుంచి..

Padma Awards 2024: రిపబ్లిక్‌ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి సంబంధించి పద్మవిభూషణ్‌, పద్మ భూషణ్‌, 34 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.

75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం జనవరి25వ తేదీన(గురువారం) ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి పద్మ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ కి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలంగాణ రాష్ట్రం జనగామకు చెందిన యక్షగాన కళకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కింది. నారాయణ పేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పకు కూడా పద్మశ్రీ పురస్కారం అందింది. అలానే  పర్బతి బారుహ్, జగేశ్వర్ యాదవ్, చమి ముర్ము, గురువిందర్ సింగ్, సత్యనారాయణ బెలెరి, సంగ్తంకిమ, హేమచంద్ మంజ్హి, దుఖు మజ్హి, కె చెల్లమ్మల్ కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి