iDreamPost

పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు! లైఫ్ లో సెటిల్ అవ్వడానికి మంచి ఛాన్స్!

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే రైల్వేలో పరీక్ష లేకుండా ఉద్యోగాలను పొందొచ్చు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం. ఓ వైపు రాష్ట్ర పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం కూడా నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ పరిధిలోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సీఆర్ఐస్) ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ అందించింది. సీఆర్ఐస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు గేట్ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా విద్యా సంస్థల నుంచి 60% మార్కులతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉన్న అభ్యర్థుల డిగ్రీని యూజీసీ/ఏఐయూ/ఏఐసీటీఈ గుర్తించాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 22 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పొందొచ్చు. మంచి వేతనంతో కూడిన ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి జీవితంలో స్థిర పడిపోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి