iDreamPost

ఒక్కడు లక్ష్యం ఖుషీని దాటడమే

ఒక్కడు లక్ష్యం ఖుషీని దాటడమే

ఫ్యాన్స్ ఎమోషన్ ని క్యాష్ చేసుకోవడానికే లక్ష్యంగా సాగుతున్న రీ రిలీజుల ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా ఖుషి వచ్చిన రెస్పాన్స్ చూసి ఇతర నిర్మాతలు తమ పాత బ్లాక్ బస్టర్స్ ని బూజు దులుపుతున్నారు. కేవలం ఒక్క రోజుకే 3 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసిన ఖుషి ఇప్పటిదాకా ఆరు కోట్ల మార్కుని దాటేసినట్టు ట్రేడ్ రిపోర్ట్. గతంలో జల్సా రెండు కోట్లకు పైగా రాబట్టుకోగా పోకిరి ఒక కోటి డెబ్భై అయిదు లక్షల దగ్గర ఆగిపోయింది. చెన్నకేశవరెడ్డి విషయంలో నిర్మాత ఫిగర్స్ ని కాస్త ఎక్కువ చేసి చెప్పడంతో దాని జెన్యూన్ రికార్డుల మీద సరైన సమాచారం లేదు. ఇప్పడు జనవరి 7 మహేష్ బాబు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఒక్కడుని మళ్ళీ విడుదల చేయబోతున్నారు

ఎలాగైనా సరే ఒక్కడుతో ఖుషి రికార్డులను దాటాలనే ధృడ సంకల్పంతో ఉన్నారు ప్రిన్స్ అభిమానులు. అయితే అదంత సులభం కాదు. ఎందుకంటే రెండు నెలల క్రితమే ఒక్కడు కొన్ని సెంటర్స్ లో లిమిటెడ్ షోస్ వేశారు. పోకిరికి పోటీ అనుకున్నారు కానీ రెండింటికి భారీ స్పందన దక్కింది. అలాంటి చోట్ల పెద్దగా రెస్పాన్స్ ఉండదు. మిగిలిన చోట్ల మాత్రం భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఒక్కడు మూవీ లవర్స్ కి సైతం వన్ అఫ్ ది బెస్ట్ ఛాయస్. థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయిన ఇప్పటి తరం ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటారు. అందుకే భారీగా ప్లాన్ చేస్తున్నారు

అంతా బాగానే ఉంది కానీ రికార్డుల గోలలో పడిపోయి ఆన్ లైన్ లో ఫ్రీగా దొరికే సినిమాలకు మళ్ళీ రికార్డులు దక్కాలని ఫ్యాన్స్ పడుతున్న తాపత్రయం మాములుగా లేదు. పోనీ వీటికి డిస్ట్రిబ్యూటర్లు రేట్లు తగ్గించి ఏమైనా టికెట్లు అమ్ముతున్నారా అంటే అదీ లేదు. కొత్త వాటికి ఏవైతే ధరలు ఉన్నాయో వాటినే అమలు చేస్తున్నారు. ఇది ఒక్కడుతో ఆగబోవడం లేదు. ఫిబ్రవరిలో తొలిప్రేమ, గ్యాంగ్ లీడర్ లు వస్తున్నాయి. సమ్మర్ లో బద్రిని ప్లాన్ చేశారు. బాద్షా విడుదల దెబ్బ కొట్టడంతో సింహాద్రితో దాన్ని మాన్పుకోవాలనే ప్లాన్ లో తారక్ అభిమానులున్నారు. నాగ్ వెంకటేష్ క్లాసిక్స్ కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. మొత్తానికి ఇంకో ఏడాది ఈ ప్రవాహం కొనసాగేలా ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి