iDreamPost

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం!

Chhattisgarh Road Accident: ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినం చేసినా డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Chhattisgarh Road Accident: ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినం చేసినా డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం!

ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. కేవలం డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వారంతా ఉద్యోగులు.. పని ముగించుకొని పండుగ పూట కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడపాలని కోటి ఆశలతో ఇంటికి బయలుదేరారు. వారందరిని మృత్యువు బస్సు ప్రమాదంలో రూపంలో వెంటాడింది.ఈ విషాద ఘటన చత్తీస్‌గఢ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. దుర్గ్ జిల్లా ఖాప్రి గ్రామం వద్ద ఓ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఓ డిస్టిల్లరీ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. పని ముగించుకొని ఇంటికి బయలుదేరుతున్న సమయంలో ఈ ఘోర సంఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు తెలుస్తుంది. కుమ్హారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాప్రీ గ్రామం సమీపంలో అదుపు తప్పి 40 అడుగుల గుంతలో బస్సు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు పరిస్థితి పరిశీలించి క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను అధీనంలోకి తీసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. క్షతగాత్రుల పరిస్థితి తెలుసుకునేందుకు స్థానిక అధికారులు హాస్పిటల్ కి చేరుకున్నారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘దుర్గ్ లో బస్సు ప్రమాదం చాలా బాధాకరం.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని ట్విట్ చేశారు. బాధితులకు అన్ని విధాలుగా సాయం అందిస్తాం అని మీడియా వేధిక తెలిపారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి