iDreamPost

తుమ్మెద ప్రాణాలు కాపాడిన మహిళ.. ఇక అప్పటినుంచి..

తుమ్మెద ప్రాణాలు కాపాడిన మహిళ.. ఇక అప్పటినుంచి..

క్రూర మృగాలైనా కానీ, కొన్ని సార్లు మనం చేసిన సాయాన్ని మర్చిపోవు. ప్రాణాలను కాపాడిన కృతజ్ఞతతో మనతో ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ప్రేమను చూపిస్తాయి.. వీలైతే మన కోసం ప్రాణాలైనా ఇస్తాయి. ప్రాణాలు కాపాడిన వ్యక్తులతో స్నేహం చేసిన క్రూర మృగాల తాలూకా సంఘటనలు ఈ ప్రపంచంలో చాలా చోటుచేసుకున్నాయి. క్రూర మృగాలే కాదు.. చిన్న చిన్న జీవులు కూడా చేసిన సాయాన్ని మర్చిపోవు. ఇందుకు జర్మనీలో జరిగిన తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.

ఓ మహిళ.. తీవ్రంగా గాయపడ్డ తుమ్మెదకు సాయం చేసింది. ఆమె కారణంగా తిరిగి ఆరోగ్యంగా తయారైన అది.. చేసిన మేలు మర్చిపోలేదు. ఎక్కడికీ వెళ్లకుండా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది. ఆమెతో స్నేహం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన క్యాథరీనా వ్యాలెన్‌ అనే మహిళ మూడు వారాల క్రితం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో ఆమెకు రోడ్డు మీద గాయపడ్డ ఓ తుమ్మెద కనిపించింది. దాని రెక్క ఒకటి విరిగిపోయి ఉంది. దీంతో ఆమెకు బాధేసింది. ఎలాగైనా దానికి సాయం చేయాలనుకుంది.

వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్లింది. తగిన వైద్యం చేసింది. తర్వాత దానికి తాగడానికి చెక్కర నీళ్లు కూడా పోసింది. వారం తర్వాత తుమ్మెద కోలుకుంది. కోలుకున్న తర్వాత ఆ తుమ్మెద అక్కడినుంచి వెళ్లిపోలేదు. ఒక రెక్క విరిగిపోయినందుకు అది అక్కడినుంచి ఎగిరిపోలేదు అనుకున్నారు. కానీ, నడుచుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. అయినప్పటికి అది అక్కడినుంచి వెళ్లలేదు. క్యాథరీనా చుట్టూనే తిరుగుతూ ఉంది. తన చుట్టూ తిరుగుతూ ఉండే తుమ్మెదకు ఆమె స్వీట్‌ పీ అని పేరుపెట్టింది.

దాన్ని పెంచుకోవాలని డిసైడ్‌ అయింది. తన గార్డెన్‌లో స్వీట్‌ పీకి ఓ చిన్న ఇళ్లు కూడా కట్టింది. ఆ తుమ్మెదలో ఆ చిన్న ఇంట్లో ఉంటూ.. అటు, ఇటు తిరుగుతూ సందడి చేస్తోంది. తన తుమ్మెద మిత్రుడి గురించి క్యాథరీనా ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీస్తూ టిక్‌టాక్‌లో పెడుతూ ఉంది. అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. అయితే, తుమ్మెద.. క్యాథరీనా స్నేహం ఎక్కువ కాలం నిలవదు. ఆ తుమ్మెద కేవలం 28 రోజులు మాత్రమే బతుకుతుంది. తర్వాత చావు ఇద్దర్నీ వేరు చేస్తుంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి