iDreamPost

లగ్జరీ కారు ధరతో పోటీ పడుతున్న ఈ గేదె రేటు!

హర్యానాలోని ఓ ప్రాంతానికి చెందిన గేదె.. దాని ధర కారణంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గేదె ధరతో ఫార్చ్యూనర్ వంటి విలాసవంతమైన కారును కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ గెదే సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది.

హర్యానాలోని ఓ ప్రాంతానికి చెందిన గేదె.. దాని ధర కారణంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గేదె ధరతో ఫార్చ్యూనర్ వంటి విలాసవంతమైన కారును కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ గెదే సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ గా మారింది.

లగ్జరీ కారు ధరతో పోటీ పడుతున్న ఈ గేదె రేటు!

మన దేశంలో ఎక్కువ మంది పాడిపంట మీదనే జీవనం సాగిస్తుంటారు. ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయంతో పాటు పశువులను పెంచుకుంటూ జీవిస్తుంటారు. అయితే కొందరు కేవలం పాడి వ్యాపారం చేస్తుంటారు. వివిధ రకాలైన మేలు జాతి గేదెలను, ఆవులను పెంచుతూ.. వాటి ద్వారా వచ్చే పాలను అమ్మి.. మంచి ఆదాయం అర్జిస్తారు. అయితే ఈ గేదెల ధరల విషయానికి వస్తే.. వివిధ రేట్లు ఉంటాయి. 50 వేల నుంచి మొదలు రెండు లక్షల వరకు ఉంటాయి. ఇంకా ప్రత్యేకమైన గేదెలు అయితే 5-6 లక్షలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఓ గేదె ధర తెలిస్తే.. మీరు షాకవ్వక మానరు. లగ్జరీ కారు ధరతో పోటీ పడుతూ.. ఆ గేదె ధర అక్షరాలా రూ.61 లక్షలు ఉంది.

హర్యానాలోని భివానీ ప్రాంతానికి చెందిన గేదె ధర కారణంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ధర్మ అనే గేదె ధరతో ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కారును కొనుగోలు చేయొచ్చు. హర్యానాలోని చాలా మంది రైతులు నాణ్యమైన గేదెలను కొనుగోలు పెంచుతున్నారు. అదే విధంగా భివానీలోని జుయ్ గ్రామానికి చెందిన సంజయ్‌ అనే రైతు వ్యవసాయం,  పశువులను పెంచుతున్నాడు. అతడి వద్ద ధర్మ అనే మూడేళ్ల వయస్సున్న గేదె వయసు ఉంది. ఆ గేదెను ఎంతో జాగ్రత్తగా పెంచాడు.

అది ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రకాల బలమైన ఆహార పదార్థాలను అందించే వాడు. సంజయ్ తెలిపిన ప్రకారం.. ధర్మ పుట్టినప్పటి నుండి శీతాకాలంలో ప్రతి రోజు పచ్చి మేత, మంచి ధాన్యాలు, 40 కిలోల క్యారెట్లు తినిపించాడు. ఆ కారణంగానే పంజాబ్, యూపీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన వివిధ పోటీల్లో ధర్మా టైటిళ్లను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ గేదె 15 లీటర్ల పాలును ఇస్తుంది. ఈ రోజుల్లో ఫార్చ్యూనర్, థార్ కార్లు హర్యానాలో బాగా ప్రాచుర్యం పొందాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ వాహనాలను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అయితే, సంజయ్ పెంచుకునే గేదె ధర ఆ రెండు కార్లను కూడా ఓడించింది. ధర్మానికి అధిక ధర వచ్చింది.

కొద్ది రోజుల క్రితం ధర్మా ధర రూ.46 లక్షలుగా నిర్ణయించామని, అయితే రూ.61 లక్షలకు విక్రయిస్తానని సంజయ్ తెలిపాడు. సంజయ్ మాత్రమే కాదు పశువైద్యుడు హృతిక్ కూడా ధర్మాన్ని ప్రశంసించాడు. అందం విషయంలో ధర్మమే గేదెల రాణి అని వైద్యుడు తెలిపారు. బహుశా హర్యానాలో అత్యుత్తమ గేదె ఇదేనని ఆయన పేర్కొన్నారు. హృతిక్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ధర్మ రూ. 61 లక్షలు ఉంది. కానీ.. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ధరకు అమ్ముతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి.. ఇంత భారీ ధర పలుకుతున్న ఈ గేదెపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి