iDreamPost

BSNL నెలకు 75GB డేటాతో రూ. 2022 ప్రీపెయిడ్ ప్లాన్‌, 300రోజుల వ్యాలిడిటీ, ఇంకా మ‌రికొన్ని ప్లాన్స్

BSNL నెలకు 75GB డేటాతో రూ. 2022 ప్రీపెయిడ్ ప్లాన్‌, 300రోజుల వ్యాలిడిటీ, ఇంకా మ‌రికొన్ని ప్లాన్స్

ప్ర‌భుత్వ యాజ‌మాన్యంలోని BSNL తన చందాదారుల కోసం, కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. పేరు “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్లాన్ 2022”. ఇందులో అపరిమిత కాలింగ్, డేటా ఇంకా చాలా ఆఫ‌ర్లున్నాయి.

BSNL ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్లాన్ 2022

పేరు సూచించినట్లుగా ప్లాన్ ధర రూ. 2,022. ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజులు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఒక్క‌సారి ప్లాన్ తీసుకున్నారా, ప‌దినెల‌ల‌పాటు బిందాస్. ఈ ప్లాన్ కాల్స్ కి లిమిట్ లేదు. రోజుకు 100 SMSలను అందిస్తుంది. దీనితో పాటు, BSNL సబ్ స్కైబ‌ర్లు నెలవారీ లెక్క‌న‌ మొత్తం 75GB డేటాను వాడుకోవ‌చ్చు. మ‌రి డేటా లిమిట్ అయిపోతే? 75GB పరిమితి ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ స్సీడు 40kbpsకి తగ్గుతుంది. ఈ స్పీడ్ వాట్స‌ప్, బ్రౌజింగ్ కి స‌రిపోతుంది.

BSNL రూ. 3,299 వార్షిక డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది, ఇది 12 నెలల పాటు నెల‌కు 2.5GB డేటాను అందిస్తుంది. మరో రూ.2,299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 12 నెలల పాటు నెల‌కు 1.5 GB రూ. 1,251 ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్ 12 నెలల పాటు నెల‌కు 0.75 GB అందిస్తుంది.

BSNL అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు రోజుకు 2 GB డేటాను వాడుకొనే రూ. 228 రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ప్రారంభించింది. మరొకటి రూ. 239 ప్లాన్. ఇది రూ.228 ప్లాన్ తోపాటు రూ. 10 టాక్‌టైమ్ అందించే అన్ని ప్రయోజనాలను కూడా ఇస్తుంది. అంటే ఒకే ప్లాన్ లో రెండు రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ల‌ను క‌లిపారు. BSNL ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 100 మెసేజ్‌లతో పాటు, రోజుకు 2 GB డేటాను వాడుకోవ‌చ్చు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (DoT) ఇటీవల భారతదేశంలో 5G స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించింది, దీనిలో Jio పెద్ద‌ బిడ్డర్‌గా అవ‌త‌రించింది, తర్వాత Airtel , Vodafone Idea ఉన్నాయి. ఈ టెలికాం కంపెనీలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి దేశంలోని అనేక చోట్ల 5G నెట్‌వర్క్‌లను ప్రారంభించాలని భావిస్తున్నారు. అక్క‌డ నుంచి మ‌రో టెలికాం రివ‌ల్యూష‌న్ మొద‌లైన‌ట్లే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి