iDreamPost

Brahmastra Advance Booking: షాకిస్తున్న బ్రహ్మాస్త్ర బుకింగ్స్ – బాయ్ కాట్ ఎఫెక్ట్ లేదే

Brahmastra Advance Booking: షాకిస్తున్న బ్రహ్మాస్త్ర బుకింగ్స్ –  బాయ్ కాట్ ఎఫెక్ట్ లేదే

రేపు విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ మీద మాములు అంచనాలు లేవు. తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ దక్కనుంది. శర్వానంద్ ఒకే ఒక జీవితం ఉన్నప్పటికీ దీనికే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్క్రీన్లు దక్కడం గమనార్హం. నాగార్జున కీలక పాత్ర పోషించడం, హీరో హీరోయిన్లు రన్బీర్ కపూర్, అలియా భట్ ఇక్కడ ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయడం హైప్ పెంచేలా సాగింది. ట్రైలర్ వచ్చినప్పటి నుంచే ఓ మోస్తరు హైప్ నెలకొంది. అయితే బాహుబలి రేంజ్ ఎక్స్ పెక్ట్ చేసిన నిర్మాతలు షోలు పూర్తయ్యేకొద్దీ ఆ టాక్ వస్తుందన్న ధీమాతో ఉన్నాయి. త్రీడితో పాటు ఐమ్యాక్స్ వెర్షన్ ని స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నారు. 400 కోట్లతో రూపొందిన విజువల్ గ్రాండియర్ ఇది

ఇక లాల్ సింగ్ చడ్డా తర్వాత బాయ్ కాట్ భయాలు దీనికీ వెంటాడాయి. ఉజ్జయిని ఆలయంలోకి రన్బీర్ అలియాలు వెళ్లకుండా నిరసనకారులు అడ్డుకోవడం ఆల్రెడీ హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ పరిణామం పట్ల ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక సోషల్ మీడియా సంగతి సరే సరి. గత రెండు వారాలుగా దీన్నో ఉద్యమంగా తీసుకెళ్తున్నారు. అయితే దీని ప్రభావం మరీ భయపడినంత తీవ్రంగా లేవని అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఆన్ లైన్ ద్వారానే సుమారు 15 కోట్లకు పైగా గ్రాస్ ఆల్రెడీ వసూలైపోయింది. ఒక్క పివిఆర్, ఐనాక్స్, సినీపోలీస్ చైన్ లోనే 6 కోట్ల 60 లక్షల దాకా కలెక్షన్ రావడం విశేషం.

ట్రేడ్ చెబుతున్న ప్రకారం 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. దీనికి రెట్టింపు స్థాయిలో రేపు థియేటర్ల వద్ద జరిగే కరెంట్ బుకింగ్ ఉంటుందని అంచనా. ముఖ్యంగా చిన్న సెంటర్లలో నేరుగా కొనే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు. అందులోనూ యాప్స్ వెబ్ సైట్లలో 30 రూపాయలు అదనంగా చెల్లించి తీసుకోవడానికి సగటు ఆడియన్స్ సిద్ధంగా ఉండరు. అందుకే ఫస్ట్ డే లెక్కలు ఊహించనంత భారీగా ఉంటాయని లెక్క వేస్తున్నారు. లాల్ సింగ్ చడ్డా మీద బాయ్ కాట్ ఎఫెక్ట్ బలంగా పడి ఓపెనింగ్స్ దెబ్బ తిన్నాయి. ఆఫ్కోర్స్ కంటెంట్ వీక్ గా ఉండటం వేరే విషయం. కానీ బ్రహ్మాస్త్ర విషయంలో అలాంటిదేమి కనిపించడం లేదు. పాజిటివ్ టాక్ వస్తే బాలీవుడ్ నిద్రమత్తు మొత్తం వదిలిపోతుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి