iDreamPost

ఆరోపణలు చేస్తే అర్థం ఉండాలి బోండా..!

ఆరోపణలు చేస్తే అర్థం ఉండాలి బోండా..!

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు, బాధితులను ఆదుకున్న వైనం, ప్రభావిత గ్రామాల్లో తిరిగి సాధారణ పరిస్థితులకు తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి నేపథ్యం లో వైసీపీ ప్రభుత్వం పై ఎలాంటి విమర్శలు చేసేందుకు అవకాశం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు శివాలెత్తిపోతున్నారు. అర్థం పర్థం లేని ఆరోపణలతో జూమ్ ప్రెస్ మీట్లు పెట్టి ఊగిపోతున్నారు. బాధితులకు కోటి రూపాయలు ఏం సరిపోతుంది..10 కోట్లు ఇవ్వాలన్న డిమాండ్ నవ్వుల పాలు కావడంతో టిడిపి నేతలు వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసుకుని అవినీతి ఆరోపణలు చేయడం ప్రారంభించారు.

ఎల్జి పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనలో జగన్ ప్రభుత్వం ఆ కంపెనీ నుంచి 300 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుందని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ఆరోపించారు. కంపెనీ పై తీవ్రమైన కేసులు పెట్టకుండా, కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేయకుండా, కంపెనీ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కంపెనీ అక్కడి నుంచి తరలించకుండా ఉండేందుకు ఈ మేరకు జగన్ ప్రభుత్వం డీల్ కుదుర్చుకుందని బోండా ఆరోపించారు. ఇప్పటికే డబ్బు కొరియా కంపెనీ నుంచి వీరి అకౌంట్ల లో చేరినట్లు తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అయితే ఆధారాలు మాత్రం జూమ్ ప్రెస్ మీట్లో బోండా ఉమ చూపించకపోవడం గమనార్హం. ఆధారాలు ఉన్నప్పుడు చూపిస్తే తాను చేసిన ఆరోపణలు వాస్తవం అని ప్రజలు అందరూ నమ్ముతారు కదా. బోండా ఉమామహేశ్వర రావుకు ఈ ఆలోచన ఎందుకు తట్టలేదో మరి.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, తమ పార్టీ నేతలపై వైసీపీ మంత్రులు అచ్చోసిన ఆంబోతుల్లా పడి మాట్లాడుతున్నారని బోండా ఉమా విమర్శిస్తున్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా అని బోండా ఉమామహేశ్వర రావు చెబుతుంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా సదరు బోండా ఉమామహేశ్వర రావు అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే కొడాలి నాని ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. ఏకవచనంతో సంబోధిస్తూ.. బూతులు మాట్లాడుతూ.. పాతేస్తా.. నా కో..క అంటూ బోండా ఉమామహేశ్వర రావు కొడాలి నాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. తాజాగా బోండా ఉమామహేశ్వర రావు వైసీపీ మంత్రులు అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నారని వాపోతుంటే.. ‘నీవు నేర్పిన నడకే నీరజాక్షి’ అనే సామెత గుర్తుకొస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి