iDreamPost

బాలీవుడ్ ధియేటర్స్ కూడా ఇక సలార్ కి? ఇది ప్రభాస్ మాస్ అంటే!

  • Published Dec 22, 2023 | 11:17 AMUpdated Dec 22, 2023 | 11:41 AM

Salaar Movie in Bollywood: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ఒకే సమయంలో అయితే ధియేటర్ల విషయంలో సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు హీరో ప్రాధాన్యతను బట్టి ధియేటర్లు కేటాయిస్తుంటారు.

Salaar Movie in Bollywood: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ఒకే సమయంలో అయితే ధియేటర్ల విషయంలో సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు హీరో ప్రాధాన్యతను బట్టి ధియేటర్లు కేటాయిస్తుంటారు.

  • Published Dec 22, 2023 | 11:17 AMUpdated Dec 22, 2023 | 11:41 AM
బాలీవుడ్ ధియేటర్స్ కూడా ఇక సలార్ కి? ఇది ప్రభాస్ మాస్ అంటే!

2023 సంవత్సరం సినీ ఇండస్ట్రీకి మహర్ధశ అని చెప్పవొచ్చు. ఈ ఏడాది భారీ సినిమాలు థియేటర్లో సందడి చేశాయి. రజినీ కాంత్ ‘జైలర్’, విజయ్ ‘లియో’, షారూఖ్ ఖాన్ ‘జవాన్’, ‘డంకీ’తో పాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘సలార్’ రిలీజ్ అయ్యాయి. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. బాలీవుడ్ లో ఈ మూవీ సెన్సేషనల్ క్రియేట్ చేసి ఇంకా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఇక క్రిస్మస్ కానుకగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డంకీ, సలార్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా మూవీస్.. అందులోనూ పెద్ద హీరోల సినిమాలు అంటే థియేటర్ల విషయంలో రగడ ఖచ్చితంగా ఉంటుంది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ కింగ్ కాన్ షారూక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. కలెక్షన్ల సునామీ సృష్టించి వెయ్యి కోట్లు వసూళ్లు చేశాయి. దీంతో షారూక్ నటించిన డంకీ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 21న షారూక్ నటించిన డంకీ రిలీజ్ అయ్యింది. ఇక కేజీఎఫ్ సీరీస్ తో వెయ్యి కోట్లు వసూళ్లు చేసి మాస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన మూవీ ‘సలార్’ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ రెండు మూవీస్ మధ్య పోటీ నెలకొని ఉంది. అయితే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల విషయంలో సమన్యాయం చేయాల్సి ఉంటుంది.. కానీ బాలీవుడ్ లో దీనికి విరుద్దంగా సలార్ మూవీకి థియేటర్ల విషయంలో అన్యాయం జరిగినట్లు తెలుస్తుంది.  బాలీవుడ్ లో డంకీ మూవీ కి భారీ ఎత్తున ధియేటర్లు లభించాయి.. సింగిల్ స్క్రీన్ తో పాటు, మల్టీ ప్లెక్స్ లో కూడా డంకీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సాధారణంగా మూవీ ఫస్ట్ షో టాక్ ని బట్టి ధియేటర్ల కేటాయింపులో మార్పులు చేస్తుంటారు. ఇప్పుడు సౌత్ లో కూడా ఇదే జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

salar movie played in dunki theaters

షారూఖ్ నటించిన డంకీ మూవీ డిసెంబర్ 21 న రిలీజ్ అయ్యింది. నార్త్ లో ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ ఉన్న థియేటర్లు మొత్తం డంకీ మూవీకే ప్రాధాన్యత ఇచ్చారు.. దీనికి కారణం అక్కడ మాఫికా డిస్ట్రిబ్యూటర్ల, థియేటర్ల యజమానులను బెదిరించి మరీ ఈ పనిచేయించినట్లు టాక్. ఈ కారణంతోనే నిన్న మధ్యాహ్నం వరకు సలార్ మూవీకి ధియేటర్లు, టికెట్స్ ఇష్యూ విషయంలో సైలెంట్ ఉన్నారు అక్కడ డిస్ట్రిబ్యూటర్. అయితే డంకీ మూవీకి రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో పెద్దగా టాక్ రాలేదు. అదే సమయంలో సలార్ మూవీకి భారీ స్పందన రావడమే కాదు.. అంచనాలు మించి ఉన్నందటూ టాక్ రావడంతో ఇప్పుడు సౌత్ డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ల యజమానులు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే డంకీకి కేటాయించిన సింగిల్ స్క్రీన్స్, పలు ధియేటర్లు సలార్ మూవీ కి కేటాయించడానికి సిద్దమైనట్లు టాక్ వినిపిస్తుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆకలి తీరినట్లు ఉందని.. సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు రెప్ప ఆర్పకుండా చూసేలా ఉందని.. సలార్ మూవీ ప్రభాస్ కి మరో మాస్ సెన్సేషన్ హిట్ అని అంటున్నారు. సలార్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ క్రేజ్ మరో రేంజ్ కి ఎదిగిపోయిందని అంటున్నారు అభిమానులు. మరి అదీ ప్రభాస్ సత్తా అంటే.. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి