iDreamPost

అతన్ని ప్రేమించి మోసపోయాను! ఇన్నాళ్లకి ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్!

  • Published Apr 13, 2024 | 9:11 PMUpdated Apr 14, 2024 | 5:55 PM

బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అతన్ని ప్రేమించి మోసపోయానంటూ తన ఫస్ట్ లవ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియాలో వైైరల్ గా మారాయి.

బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అతన్ని ప్రేమించి మోసపోయానంటూ తన ఫస్ట్ లవ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం విద్యాబాలన్ చేసిన వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియాలో వైైరల్ గా మారాయి.

  • Published Apr 13, 2024 | 9:11 PMUpdated Apr 14, 2024 | 5:55 PM
అతన్ని ప్రేమించి మోసపోయాను! ఇన్నాళ్లకి ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ నటి ‘విద్యాబాలన్’.. ఈ పేరు వినగానే మొదటిగా డర్టీ పిక్చర్ సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాతో ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అయితే ఇప్పటి వరకు చాలా సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన విద్యాకు.. 2011లో విడుదలైన ‘ధి డర్టీ పిక్చర్’ సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. కాగా, విద్యాబాలన్ నటించిన సినిమాలన్నీ దాదాపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావడం విశేషం.అలాగే కేవలం లేడీ ఓరియెంటెండ్ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అమ్మాడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక సినిమాల్లో తనదైన అందం, అభినయంతో కలిగిన విద్యాబాలన్ కు విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మాడు పెద్దగా ఏ సినిమాల్లోనూ కనిపించడం లేదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యాబాలన్ తన మొదటి లవ్ గురించి అలాగే బాలీవుడ్ నటుల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం విద్యాబాలన్ చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ గా ఎదగిన విద్యాబాలన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన మొదటి లవ్ గురించి, అలాగే బాలీవుడ్ నటుల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా.. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘నా ప్రేమ విషయానికొస్తే.. నేను ఓ వ్యక్తిని ప్రేమించి దారుణంగా మోసపోయానే. పైగా నేను అతడితో డేటింగ్ కూడా చేశాను. అయిన ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు. దీంతో మా ప్రేమకు బ్రేకప్ పడింది.  ఓ రోజు కాలేజీలో ప్రేమికుల రోజున నేను అతడితో గొడవ పడ్డాను. దాంతో అతను నాతో.. నేను నా మాజీ ప్రియురాలిని కలవడానికి వెళ్తున్నా అని అన్నాడు. ఇక ఆ మాట విని నా గుండె ముక్కలైంది. అసలు ఇలాంటి వాడినా నేను ప్రేమించింది అని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత.. నేను నా జీవితాన్ని చాలా మార్చుకున్నా. అలాగే  నేను కొంతమందిని ప్రేమించాను కానీ,  ఎవరితోనూ డీప్ రిలేషన్ పెట్టుకోలేదు.  అలాగే హీరోయిన్ గా మారిన తర్వాత కొంతమంది హీరోలు నాతో సినిమా చేయడానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా.. నిర్మాతలు సైతం నన్ను ఐరెన్ లెగ్ అనుకునే వారు అని విద్య  తెలిపింది.

అలాగే నాతో  నటించడానికి చాలా మంది స్టార్ హీరోలు అసౌకర్యంగా భావించేవారు. అయితే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని అని కూడా తెలిపింది. ఇక నేను ఓ ఫార్ములాతో సినిమాలు చేస్తున్నాను. కానీ, ఇందులో నాకు లేడీ ఓరియేంటెడ్ సినిమాలే ఎక్కువ ఉత్సాహాన్నిస్తాయి. అయితే ఇలాంటి సినిమాలు చేస్తే నాలు మెచ్చుకోలేదని నేను అనడం లేదు కానీ, ఆడవాళ్లు ఎక్కువగా హైలైట్ అవుతున్నారని హీరోలు సంతోషించరు అని విద్య తెలిపింది. అలాగే నాతో  నటించకపోతే వారికే నష్టం’ అని విద్య చెప్పుకొచ్చింది.  కాగా, ప్రస్తుతం విద్యాబాలన్ ‘దో ఔర్ దో ప్యార్’ సినిమాలో నటిస్తోంది.  అయితే ఈ సినిమాలో ప్రతీక్ గాంధీ హీరోగా నటిస్తున్నారు.  అలాగే ఇందులో ఇలియానా డిక్రూజ్ కూడా నటిస్తుంది. ఇక ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.  మరి, విద్యాబాలన్ తన మొదటి లవ్ పై, బాలీవుడ్ నటుల పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి