iDreamPost

నాకు మగవాడి అవసరం లేదు.. బాహుబలి హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

  • Published Apr 12, 2024 | 1:28 PMUpdated Apr 12, 2024 | 1:28 PM

ఫెమినిజం యుగం ద్వారా చాలా మంది పురుషులు బ్రెయిన్‌వాష్ అయ్యారు. అసలు నాకు మగవాడి అవసరం లేదంటూ.. బాలీవుడ్ హాట్ బ్యూటీ సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఫెమినిజం యుగం ద్వారా చాలా మంది పురుషులు బ్రెయిన్‌వాష్ అయ్యారు. అసలు నాకు మగవాడి అవసరం లేదంటూ.. బాలీవుడ్ హాట్ బ్యూటీ సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Apr 12, 2024 | 1:28 PMUpdated Apr 12, 2024 | 1:28 PM
నాకు మగవాడి అవసరం లేదు.. బాహుబలి హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

‘నోరా ఫతేహి’. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. అంతేకాకుండా ఇటు తెలుగులోనూ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసి సౌత్ లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా.. నోరా ఫతేహి.. ‘టెంపర్’ , ‘బహుబలి-1’, ‘కిక్ -2’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు చిందులు వేసింది. కాగా, ఇటీవలే ఈ భామ ‘మడ్గాన్’ అనే సినిమాతో ప్రేక్షకుల మెప్పించిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో తరుచు యాక్టివ్ గా ఉండే  ఈ అమ్మాడు తన గ్లామరెస్ ఫోటోలతో  కుర్రాళ్ల మతి పొగొడుతుందే అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నోరా.. అక్కడ మహిళా స్వేచ్చా, స్త్రీవాదం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ అనేవి నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే అక్కడ మహిళా స్వేచ్చా, స్త్రీవాదం పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియా పోడ్‌కాస్ట్ ‘ది రణవీర్ షో’లో నోరా పాల్గొని మాట్లాడుతూ.. ‘ఫెమినిజం యుగం ద్వారా చాలా మంది పురుషులు బ్రెయిన్‌వాష్ అయ్యారు, ఇక ప్రతి స్త్రీకి తన స్వంత ఆలోచనలు కలిగి ఉండాలని, కచ్చితంగా స్వేచ్చ కలిగివుండలని తెలిపింది. అలాగే నాకు మగవాడి అవసరం లేదు. ఎందుకంటే.. నాకు స్త్రీవాదం వంటి వాటిపై నమ్మకం లేదు. అసలు మహిళలు ఉద్యోగాలు చేయాలి, వారికి స్వంత జీవితాలు ఉంటాయి. అందువల్ల ప్రతిఒక్క స్త్రీ స్వతంత్రంగా ఉండాలి. కానీ, అది కూడా ఒక పరిమితి వరకు మాత్రమే ఉండాలి.  అంతేకాకుండా.. నాకు ‘ఫెమినిజం’ వంటి వాటి అవసరం లేదు. అందరిలా నేను ఈ మూర్ఖత్వాన్ని నమ్మను. అందుకు కారణం.. స్త్రీవాదం మన సమాజాన్ని నాశనం చేసిందని నేను భావిస్తున్నాను. పైగా మహిళలు అన్నదాతు అని నేను అనుకుంటాన్నాను. కానీ, వారు కూడా పనికి వెళ్లాలి, వారి స్వతగా జీవితాన్ని గడపాలి.

Nora fatehi bold comments

అలాగే ఒక స్త్రీగా, తల్లిగా, భార్యగా, కుటుంబాన్ని పోషించే పాత్రను కూడా తీసుకోవాలి. అయితే పురుషులు డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలబడాలి. అంతేకాకుండా.. ఒక తండ్రి, భర్త ఇలా ప్రతిఒక్కరూ ప్రతి స్త్రీ ఆలోచనకు గౌరవం ఇవ్వాలని నోరా పేర్కొంది. ఇక ఇలా చెబితే పాత సంప్రదాయ ఆలోచనలు అంటారు. కానీ, అప్పటి ఆలోచనలే సరైనవి. ఎందుకంటే కొంతమంది పురుషులు ఇంట్లో పని చేయడానికి ఇష్టపడరు. అయితే ఈ స్త్రీ వాదం ప్రపంచంలో.. పురుషులు బ్రెయిన్‌వాష్ చేయబడుతున్నారు’ అంటూ నోరా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నోరా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మరి, గ్లామరెస్ క్విన్ నోరా ఫతేహి స్త్రీవాదం పై చేసిన సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి