iDreamPost

వీడియో: వామ్మో గాల్లో ఉండగానే విమానంలో మంటలు.. తర్వాత..

ఈ మద్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపాలు తలెత్తడం, ఇంజన్ లో మంటలు రావడం పలు కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ మద్య కాలంలో విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సాంకేతిక లోపాలు తలెత్తడం, ఇంజన్ లో మంటలు రావడం పలు కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

వీడియో: వామ్మో గాల్లో ఉండగానే విమానంలో మంటలు.. తర్వాత..

ఇటీవల కాలంలో విమాన ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజన్ లో మంటలు రావడం, ఇతర సాంకేతిక లోపాలు, వాతావరణంలో మార్పులు ఇతర కారణాల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాన్ని వెంటనే పైలట్లు గమనించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సంఘటనలు ఎన్నోఉన్నాయి. కొన్నిసార్లు ఆకాశంలోనే విమానం ప్రమాదంలో ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. గత ఏడాది పలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా ఓ బోయింగ్ విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. అట్లాస్ ఎయిర్ కు చెందిన ఓ బోయింగ్ విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. పైలెట్ వెంటనే అప్రమాత్తం కావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. అమెరికా ఫ్లోరిడాలోని మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో నిన్న రాత్రి జరిగింది. అట్లాస్ ఎయిర్ కు చెందిన బోయింగ్ 747-8 కార్గో విమానం మియామీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజన్ నుంచి పొగలు, మంటలు వచ్చాయి. వెంటనే సిబ్బంది అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం గురించి  విమానశాఖ అధికారులను సంప్రదించి విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకువెళ్లి మియామీ ఎయిర్ పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలెట్లు. ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, బోయింగ్ విమానం టేకాఫ్ అయిన తర్వాత మంటలు చెలరేగిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనలు తరుచూ జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురి అవుతున్నారు.. నేలపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా రక్షణ లేకుండా పోతుందని భయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి