iDreamPost

పనివాళ్లని యజమానులుగా మార్చి.. ఓనర్ కన్నుమూత!

  • Published Feb 23, 2024 | 5:55 PMUpdated Feb 23, 2024 | 5:55 PM

ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారంటే కేవలం వారికీ నెల జీతం మాత్రమే దక్కుతుంది. లేదా వారి పని తీరుని బట్టి ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ ఇలా లభిస్తుంది. కానీ, ఇక్కడ ఓ సంస్థలో ఉద్యోగులకు మాత్రం ఏకంగా ఆ సంస్థలూ భాగం అయ్యే అదృష్టం దక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారంటే కేవలం వారికీ నెల జీతం మాత్రమే దక్కుతుంది. లేదా వారి పని తీరుని బట్టి ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ ఇలా లభిస్తుంది. కానీ, ఇక్కడ ఓ సంస్థలో ఉద్యోగులకు మాత్రం ఏకంగా ఆ సంస్థలూ భాగం అయ్యే అదృష్టం దక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 23, 2024 | 5:55 PMUpdated Feb 23, 2024 | 5:55 PM
పనివాళ్లని యజమానులుగా మార్చి.. ఓనర్ కన్నుమూత!

సహజంగా ఎక్కడైనా ఏదైనా సంస్థలో లాభాలు నడుస్తున్నాయంటే .. ఆ సంస్థ అక్కడి ఉద్యోగులకు జీతం పెంచడం కానీ, బోనస్ ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే, ఏ కంపెనీలో పని చేసే ఉద్యోగులైన .. ఆయా సంస్థలను టార్చర్ లా భావిస్తున్నారు. దీనితో ఉద్యోగాన్ని భారంగా భావించే వారే ఈ మధ్య ఎక్కువైపోయారు.. కానీ, ఇక్కడ ఓ మిలినియర్ మాత్రం తన కంపెనీలో పని చేసే 700 మంది ఉద్యోగులకు ఏకంగా తన సంస్థలో భాగస్వామ్యాన్ని ఇచ్చేసాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు ‘బాబ్స్ రెడ్ మిల్’ వ్యవస్థాపకుడు బాబ్ మూర్ . కానీ, ఆ సంస్ధలో ఉద్యోగులకు హక్కులను రాసిచ్చిన యజమాని బాబ్ మూర్ ఇక లేరు.

కాగా, అమెరికాకు చెందిన బాబ్ మూర్ ‘బాబ్స్ రెడ్ మిల్’ సంస్థను 1978లో స్థాపించారు. ఈ సంస్థ చిరు ధాన్యాలను ఉత్పత్తి చేయడంలో చాలా ప్రసిద్ధి చెందినది. ఓ చిన్న వ్యాపారంగా ప్రారంభించిన ఈ సంస్థను.. బాబ్ తన కృషితో కష్టంతో.. ఈ కంపెనీని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. అలాగే , ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల గురించి కూడా అతను ఎంతో ఉన్నంతగా ఆలోచించారు. వారి సంస్థలో పని చేసే ఉద్యోగులకు కేవలం జీతాలు ఇవ్వడంతో సరిపెట్టకుండా.. ఆ కంపెనీలో వాటాను ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2010 లో జరిగిన తన 81వ పుట్టిన రోజు సంధర్బంగా.. 209 మంది ఉద్యోగులకు.. బాబ్స్ రెడ్ మిల్ లో పార్ట్నర్షిప్ ఇచ్చారు. అయితే, అప్పటికే మూర్ ఆ సంస్థ యజమానిగా తప్పుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా ఇప్పుడు ఆ కంపెనీలో 700 మంది ఎంప్లాయిస్ ఉన్నారు. ఇప్పుడు ఆ సంస్థకు 700మంది యాజమాన్యం వహిస్తున్నారన్నమాట.

అయితే, బాబ్ తన కంపెనీ ఉద్యోగులకు సంస్థ భాద్యతలను అప్పగిస్తూ.. “ఒక కంపెనీ ఉద్యోగుల కంటే లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయాన్ని నివారించడమే.. బాబ్స్ రెడ్ మిల్ కంపెనీ ముఖ్య ఉద్దేశం” అని పేర్కొన్నారు. అలాగే విజయం సాదించే క్రమంలో మన కోసం పని చేసే వారి పట్ల దయతో ఉండడం కూడా చాలా ముఖ్యమని తెలియజేశారు. అందుకే కంపెనీ లాభాల బాట పట్టిన వెంటనే .. తన ఉద్యోగుల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వ్యక్తపరిచారు. అలాగే తన దగ్గర చాలా డబ్బు ఉందని .. వాటిని వృధాగా ఖర్చు చేయకుండా .. మంచి లక్ష్యానికి చేరేందుకు వినియోగిస్తున్నాని కూడా చెప్పారు. ఇక ఈ కంపెనీ టర్న్ ఓవర్ విషయానికొస్తే.. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం బాబ్స్ రెడ్ మిల్ సంస్థ .. 2018 నాటికి 100 మిలియన్ల డాలర్లుగా అంచనా వేసింది. ప్రస్తుతం 70 కంటే ఎక్కువ దేశాల్లో.. 200లకి పైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది బాబ్స్ రెడ్ మిల్ కంపెనీ. అయితే , ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన .. ఆ కంపెనీ అసలు యజమాని బాబ్ మూర్ ఫిబ్రవరి 10న కన్ను మూశారని.. ఆ కంపెనీ ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన మృతి పట్ల వారంతా సంతాపం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి