iDreamPost

ఘరో పడవ ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి!

Vadodara: తరచూ ఏదో ఒక ప్రాంతంలో పడవ ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు మనం అనేకం చూస్తున్నాం. తాజాగా ఓ ఘరో పడవ ప్రమాదం జరిగి 14 మంది విద్యార్థులు మరణించారు.

Vadodara: తరచూ ఏదో ఒక ప్రాంతంలో పడవ ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు మనం అనేకం చూస్తున్నాం. తాజాగా ఓ ఘరో పడవ ప్రమాదం జరిగి 14 మంది విద్యార్థులు మరణించారు.

ఘరో పడవ ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి!

తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అధిక బరువు, వరదల తీవ్ర ఎక్కువగా ఉండటం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇక ఈ పడవ, బోటు ప్రమాదాల కారణంగా ఎందరో జల సమాధి కాగా మరెందరో గల్లంతై కుటుంబాలకు కన్నీరు ముగులుస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్ లో ఓ బోటు ప్రమాదం జరిగి నలుగురు మరణించారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మరణించారు.

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఘరో పడవ ప్రమాదం జరిగింది. 27 మంది విద్యార్థులతో వెళ్తున్న ఈ పడవ ప్రమాదానికి గురైంది. ఈఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరు విద్యార్థులు నీటిలో గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. అలానే గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. వండోదరలోని హర్ని సరస్సులో విహార యాత్రం కోసం ఈ విద్యార్థులు వెళ్లారు.

ఈ క్రమంలోనే ఆ సరస్సులో విద్యార్థులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. అలానే ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు కూడా మరణించినట్లు సమాచారం. మిగిలిన వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టారు. అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఇక ఉదయం ఎంతో ఉత్సాహం గా వెళ్లిన విద్యార్థులు..విగత జీవులుగా మారడంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. జిల్లా అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.. ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి