iDreamPost

GPS సిస్టమ్‌ని గుడ్డిగా ఫాలో అవుతూ.. ఏకంగా నది మీదకు!

  • Published Feb 01, 2024 | 5:16 PMUpdated Feb 01, 2024 | 5:16 PM

చాలామంది ఏదైన కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే GPSని ఆధారంగా తీసుకొని వెళ్తుంటారు. అయితే అన్ని సందర్భల్లో ఈ GPS సరైన గమ్యన్ని చేరుస్తుంది అనుకుంటే పొరపాటే. తాజాగా ఓ మహిళ తన స్నేహితురాలిని కలవడం కోసం ఈ GPS సిస్టమ్ ను నమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇంతకి అది ఎక్కడంటే..

చాలామంది ఏదైన కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే GPSని ఆధారంగా తీసుకొని వెళ్తుంటారు. అయితే అన్ని సందర్భల్లో ఈ GPS సరైన గమ్యన్ని చేరుస్తుంది అనుకుంటే పొరపాటే. తాజాగా ఓ మహిళ తన స్నేహితురాలిని కలవడం కోసం ఈ GPS సిస్టమ్ ను నమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇంతకి అది ఎక్కడంటే..

  • Published Feb 01, 2024 | 5:16 PMUpdated Feb 01, 2024 | 5:16 PM
GPS సిస్టమ్‌ని గుడ్డిగా ఫాలో అవుతూ.. ఏకంగా  నది మీదకు!

ఒకనొక కాలంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లలంటే.. ఎవరికైనా అడ్రస్ ని అడిగి, తెలుసుకొని వెళ్లేవారు. అలా పూర్తి సమాచారం తెలుసుకొని తమ గమ్య స్థానికి సురక్షితంగా చేరుకునేవారు. కానీ, ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రపంచం మొత్తంన్ని అరచేతిలోనే దర్శనం ఇస్తుంది. కనుక ఏ సమాచారన్ని అయిన ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైన తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే GPS సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఉన్న చోటు నుంచి మనం చేరవలసిన గమ్యస్థానికి ఏ విధంగా చేరుకోవాలో తెలియజేస్తుంది. అందుచేతనే చాలామంది కొత్త ప్రాంతాలకు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ ని ఆధారంగా తీసుకొని వెళ్తుంటారు. అయితే అన్ని సందర్భల్లో ఈ గూగుల్ మ్యాప్ సరైన గమ్యన్ని చేరుస్తుంది అనుకుంటే పొరపాటే. ఈ క్రమంలోనే చాలామంది GPSని నమ్మి నిర్మానుష్యమైన ప్రాంతాలకు, అడవులకు చేరుకునే ఘటనలు చాలానే విన్నాం. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మహిళ తన స్నేహితురాలిని కలవడం కోసం ఈ GPS సిస్టమ్ ను నమ్ముకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

ఇటీవలే ఓ మహిళ గూగుల్ మ్యాప్ ని నమ్మి గుడ్డిగా వెళ్లడంతో అర చేతిలో ప్రాణలు దక్కించుకున్నంత పని జరిగింది. థాయ్‌లాండ్‌ చెందిన 38 ఏళ్ల మహిళ తన స్నేహితురాలిని కలవడం కోసం.. తన హూండా సెడాన్ కారులో ప్రయాణించింది. అయితే తాను వెళ్లవలసిన ప్రాంతానికి సంబంధించి సరైన దారి ఆవగహణ లేకపోవడంతో.. వెంటనే GPS సహాయన్ని తీసుకొని ప్రయాణం మొదలు పెట్టింది. అలా వెళ్తు వెళ్తు.. ఓ నదిని దాటడం కోసం ఒక చెక్క వంతెన పై కారును నడిపించింది. అలా ఆ వంతెనపైకి దాదాపు 15 మీటర్ల దూరం వరకు కారులో పయాణమైన ఆ మహిళ ఆ తర్వాత ముందుకు వెళ్లలేకపోయింది. ఎందుకంటే ఆ కారు ముందు భాగంలోని ఎడమ చక్రం చెక్క బ్రిడ్జ్ లో చిక్కుకుంది. అయితే ఈ సంఘటన జనవరి 28న సాయంత్రం 5:40 గంటల ప్రాంతంలో వియాంగ్ థాంగ్ బ్రిడ్జ్ మధ్యలో చోటు చేసుకుంది. అయితే అదే సమయంలో బ్రిడ్జిని దాటబోతున్న పాసర్ మకున్ ఇంచాన్ అనే వ్యక్తి బిడ్జిలో కూరుకుపోయిన మహిళ కారుని గమనించారు.

అలాగే ఆ సమయంలో యువతి సహాయం కోసం కేకలు వేయడంతో.. అది విన్న ఇంచాన్ తక్షణమే అత్యవసర సేవలు చేసే బృందానికి సమాచారం అందజేశాడు. వారు వెంటే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, బ్రిడ్జ్ లో ఇరుక్కుపోయిన వాహనాన్ని ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు మొదలుపెట్టారు. చివరికి రెండు ట్రాక్టర్ల సహయంతో ఆ మహిళ ఉండే కారును చాలా సురక్షితంగా వెనక్కి తీసుకు వచ్చారు. అయితే 120-మీటర్ల పొడవైన ఈ వంతెన చాలా ఇరుకుగా ఉంటుంది. అంతేకాకుండా ఇది 40 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. వాస్తవానికి ఈ వంతెన పాదచారుల కోసమే నిర్మించారు. ఇక ఇప్పటి నుంచి ఇతరులను హెచ్చరించేందుకు స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను పాసర్ మకున్ ఇంచాన్ కోరారు. మరి, GPS ను గుడ్డిగా నమ్మిన మహిళ ప్రాణలకు మీదకు తెచ్చుకునే ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి