iDreamPost

వీడియో: కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న BJP ఎమ్మెల్యే!

విధి నిర్వహణలో ఉన్న అధికారులు,ఇతర ఉద్యోగులపై రాజకీయ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఆఫీసుల్లోకి చొచ్చుకువెళుతున్న నేతలు... అక్కడి అధికారులను ఎడాపెడా వాయించేస్తున్నారు

విధి నిర్వహణలో ఉన్న అధికారులు,ఇతర ఉద్యోగులపై రాజకీయ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఆఫీసుల్లోకి చొచ్చుకువెళుతున్న నేతలు... అక్కడి అధికారులను ఎడాపెడా వాయించేస్తున్నారు

వీడియో: కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న BJP ఎమ్మెల్యే!

ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే వారు. కానీ నేటికాలంలో చాలా మంది ప్రజాప్రతినిధులు.. ప్రజల పనులు తప్ప.. మిగత అన్ని పనులు చూసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార మదంతో వీరి చేసే అరాచకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విధి నిర్వహణలో ఉన్న అధికారులు,ఇతర ఉద్యోగులపై రాజకీయ నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఆఫీసుల్లోకి చొచ్చుకువెళుతున్న నేతాశ్రీలు… అక్కడి అధికారులను ఎడాపెడా వాయించేస్తున్నారు. ఇలాంటి ఘటలు తరచూ ఏదో ఒక ప్రాంతలో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే పోలీస్ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్రకు చెందిన సునీల్ కాంబ్లే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బీజేపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఓ ఘటనతో ఆయన వార్తల్లో నిలిచారు. శుక్రవారం పూణె కంటోన్మెంట్ లోని సస్సూన్ జనరల్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి డిప్యూటీ సీఎం అజిత్ పవార్, స్థానిక ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే హజరయ్యారు. కార్యక్రం అనంతరం మెట్లు దిగి వస్తున్న ఎమ్మెల్యే కాంబ్లేకి ఓ పోలీస్ కానిస్టేబులు ఎదురు పడ్డాడు. దీంతో సదరు ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.  అంతేకాక కానిస్టేబుల్ పై తిట్ల దండకం అందుకున్నాడు.

BJP MLA who got hands on the constable!

ఇంకా దారుణం ఏమిటంటే.. సదరు కానిస్టేబుల్ పై ఎమ్మెల్యే సునిల్ చేయి చేసుకున్నారు. ఎమ్మెల్యే.. కానిస్టేబులు చెంప చెల్లుమనిపించడంతో అక్కడి వారు క్షణం పాటు ఆశ్చర్యంలో ఉండి పోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం బాధిత కానిస్టేబుల్‌ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కాంబ్లేపై ఐపీసీ సెక్షన్‌ 353 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాంబ్లే ఘటనపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని పేర్కొన్నారు.

మెట్లుదిగి వస్తుండగా అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తిని పక్కకు తోసేసి, ముందుకు వెళ్లానంతేనని ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలా అధికారులపై  చేయి చేసుకున్న ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. అంతేకాక నాయకుల అవినీతిని ఎదిరించి అధికారులను హత్యలు చేసిన  ఘటనలు కూడా చాలా జరిగాయి. అధికారంతో విర్రవీగే నేతలు కఠిన శిక్షలు వేసినప్పుడే ఇలాంటి ఆగడాలు అరికట్టవచ్చని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి