iDreamPost

ఒక్క అభ్యర్థితో తెలంగాణ బీజేపీ రెండో లీస్ట్ విడుదల!

తెలంగాణలో క్షణ క్షణం రాజకీయాలు ఉత్కంఠంగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థుల ఖారారు విషయంలో మరింత జాప్యం జరుగుతుంది.

తెలంగాణలో క్షణ క్షణం రాజకీయాలు ఉత్కంఠంగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థుల ఖారారు విషయంలో మరింత జాప్యం జరుగుతుంది.

ఒక్క అభ్యర్థితో తెలంగాణ బీజేపీ రెండో లీస్ట్ విడుదల!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది నేతల్లో హై టెన్షన్ మొదలైంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే తమ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడమే కాదు.. బీ-ఫారాలు కూడా ఇస్తుంది. ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా తర్జనభర్జన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల పేర్లతో జాబితా రిలీజ్ చేయగా, బీజేపీ 52 మంది అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది. శుక్రవారం 45 మంది కాంగ్రెస్ అభ్యర్థుల లీస్ట్ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ రెండో లీస్ట్ రిలీజ్ చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ ప్రచారంలో దూసుకు పోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రచారాలు చేస్తూ ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. శుక్రవారం కాంగ్రెస్ రెండో జాబితా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ రెండో జాబితా రిలీజ్ చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఫస్ట్ లీస్ట్ రిలీజ్ చేసి చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఒకే ఒక్క అభ్యర్థి పేరు తో ఈ జాబితా రిలీజ్ చేసింది.

మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఏపీ మిథన్ కుమార్ రెడ్డి పేరు ఖరారు చేస్తూ బీజేపీ అధిష్టానం ఒక నోట్ రిలీజ్ చేసింది. మిథున్ కుమార్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు. 1999లో జితేందర్ రెడ్డి బీజేపీ తరుపున ఎంపీగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ లో చేరిన తర్వాత మరోసారి మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు. కొన్ని కారణాల వల్ల బీఆర్ఎస్ కి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ గూటికి చేరారు. ఈసారి ఆయన పోటీ చేయకుండా కుమారుడిని రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ నియోజవర్గం నుంచి బీజేపీ టికెట్ మిథున్ రెడ్డి దక్కించుకున్నారు. కొంతకాలంగా జితెందర్ రెడ్డి దీనికోసం చాలా కష్టపడ్డారని.. ఈసారి మహబూబ్ నగర్ లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయం అని పార్టీ నేతలు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి