iDreamPost

ఆందోల్ బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ! తండ్రీ కొడుకు మద్య పోటీ!

తెలంగాణ లో త్వరలో ఎన్నికల జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీ నేతలు ప్రచారంలో దుమ్మురేతున్నారు.

తెలంగాణ లో త్వరలో ఎన్నికల జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీ నేతలు ప్రచారంలో దుమ్మురేతున్నారు.

ఆందోల్ బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ! తండ్రీ కొడుకు మద్య పోటీ!

తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గరపడుతుంది.. అధికార, ప్రతిపక్ష పార్టీలు నేతల్లో టెన్షన్ మరింత ఎక్కువ అవుతుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారు చేసి బీ-ఫారాలు కూడా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి 55 మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి 52 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు మాత్రమే విడుదల చేశారు. అయితే టికెట్ పై ఆశలు పెట్టుకున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. సెకండ్ లీస్టు లో తమ పేర్లు ఖరారు అవుతాయా? లేదా? అన్న సందిగ్ధంలో పడిపోయారు. అందోల్ నియోజకవర్గం టికెట్ పై ఈసారి తండ్రీ కొడుకులు పోటీ పడటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్ ఖారారు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు 52 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేశారు. ఇక అమిత్ షా టూర్ తర్వాత మిగతా అభ్యర్థుల పేర్లు ఖారారు చేయన్నుట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. అందోలు నియోజకవర్గ బీజేపీ టికెట్ కోసం ఈసారి తండ్రీ కొడుకులు పోటీ పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి బాబు మోహన్.. అందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెరపైకి ఆయన కొడుకు ఉదయ్‌ బాబూమోహన్‌ పేరు వచ్చింది. దీంతో ఆయన వర్గీయులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

మొదటి నుంచి కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు బాబు మోహన్. అయితే ఇప్పుడు బీజేపీలో టికెట్ కేటాయింపు సమయంలో కుమారు పేరు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాబు మోహన్. 1998 లో ఆందోల్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. తర్వాత 1999 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ సమయంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2004, 2009లో దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ లో చేరి ఆందోల్ టికెట్ సంపాదించి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు.

నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే పదవిలో కొనసాగారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీనుంచి తప్పుకొని బీజేపీ కండువ కప్పుకున్నారు. బీజేపీ తరుపు నుంచి పోటీ చేసి మూడో స్థానం సంపాదించారు. ఈ మద్య బీజేపీ ప్రకటించిన 52 మంది అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు రాలేదు.. వచ్చే లీస్టుపై ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బాబుమోణ్ పేరు బీజేపీ అధిష్టానం పరిశీలిస్తుందని, అందుకే ఫస్ట్ లీస్టులో బాబు మోహన్ పేరు లేదని పార్టీ వర్గాల వారు చెబుతున్నారు. ఈసారి ఆందోల్ లో ఉదయ్ బాబుమోహన్ ను నియోజకవర్గంలో దింపడంపై చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి