iDreamPost

మొన్న డిసైడ్‌.. ఇప్పుడింకా డిస్కషన్స్‌..?!

మొన్న డిసైడ్‌.. ఇప్పుడింకా డిస్కషన్స్‌..?!

మొన్నిటికి మొన్న తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధే ఉంటారు అని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తేల్చేసారు. అయితే ఇప్పుడు తాజాగా తమ పార్టీ జనసేనలు అభ్యర్ధిపై డిస్కషన్స్‌లో ఉన్నామంటూ ప్రకటించారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్‌ అన్న సందిగ్ధం అటు బీజేపీ–జనసేన ఉభయ పక్షాల్లోనూ అయోమనం సృష్టిస్తోందంటున్నారు పరిశీలకులు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల గురించి చర్చ మొదలైన నాటి నుంచీ వైఎస్సార్‌సీపీ మినమా మిగిలిన అన్ని పార్టీల్లోనూ అనేకానేక ఘటనలు, సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు.

గత ఎన్నికలు, ప్రస్తుత బలం అంచనా వేసుకుంటే అధికార వైఎస్సార్‌సీపీ ధీమాగానే కూర్చుంది. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పార్టీ అభ్యర్ధిని ప్రకటించింది. అప్పట్నుంచి ఒకడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నరీతిలో వ్యవహరిస్తోంది. అభ్యర్ధిసైతం ఇంకా జనం ముఖం చూడాలేదనే అంటున్నారు. ఇక బీజేపీ–జనసేన అంశానికే వస్తే ఇరు పార్టీల కీలక నాయకులు తమతమ సొంత ప్రకటనలో కాకరేకెత్తిస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఎన్నికల సందర్భంగా ఎదుటి పార్టీలకు కాకరేకెత్తే విధంగా చర్యలు ఉండాలి. కానీ ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ–జనసేల మధ్యే కాకరేగుతుండడంతో ఆసక్తికరంగా మారిదంటున్నారు.

ఇటీవలే తిరుపతిలో పర్యటించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మా పార్టీ అభ్యర్ధే పోటీలో ఉంటాడు, జనసేన మద్దతుగా ఉంటుందని ప్రకటించేసారు. దీంతో అక్కడ జనసేన నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురైంది. వాళ్ళుఇంకొంచెం ముందుకు వెళ్ళి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లును కూడా బైటపెట్టేసారు. నోటాతో పోటీ పడిపోయిన విషయాన్ని గుర్తు చేసి మరీ తమ కోపాన్ని వెలిబుచ్చారు. దీంతో కొద్ది రోజులు వివాదం సద్దుమణిగిట్టే కన్పించింది. తాజాగా చిత్తూరు పర్యటనలో ఉన్న సోము తిరుపతి ఎంపీ స్థానంపై మిత్రపక్షాలతో ఇంకా డిస్కషన్స్‌ చేస్తున్నామని త్వరలోనే ప్రకటిస్తామంటే చెప్పుకొచ్చారు. అదేంటి తిరుపతిలో డిక్లేర్‌ చేసేసి, చిత్తూరులో డిస్కషన్స్‌ అంటున్నారంటేన్న సందేహం అటు మీడియాలోనూ, ఇటు ఇరు పార్టీల్లోనే వ్యక్తమవుతోంది.

అయితే తిరుపతి పర్యటనలో ఏకపక్షంగా చేసిన ప్రకటన నేపథ్యంలో జనసేన నుంచి ఎదురైన వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకునే సోము ఈ విధంగా వ్యవహరించి ఉంటారా? లేక అధిష్టానం నుంచి ఏమైనా తాఖీదులు వచ్చాయా? అన్న చర్చ జోరుగా నడుస్తోంది. బీజేపీ ఏపీ చీఫ్‌ వ్యవహార శైలితో మరోసారి జనసేన–బీజేపీ సహజీవనంపై చర్చలకు తెరలేచాయి. చివరికి ఏ రకమైన రిజల్టు రానుందో కాలమే తేల్చాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి