iDreamPost

Bigg Boss విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు.. 7 ఏళ్లు శిక్షపడే ఛాన్స్?

పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఫైనల్స్ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.

పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బిగ్ బాస్ ఫైనల్స్ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.

Bigg Boss విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు.. 7 ఏళ్లు శిక్షపడే ఛాన్స్?

బిగ్ బాస్ ఫైనల్స్ గ్రాండ్ గా ముగిశాయి. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో రైతు బిడ్డ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. కాగా ఫైనల్స్ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్నారు. అటు రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ ఫ్యాన్స్ కూడా భారీగానే చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. నానా రచ్చ చేసి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురు గాయపడగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతడిపై నమోదైన సెక్షన్ల ప్రకారం దాదాపు 7 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ ఫైనల్స్ సందర్భంగా అక్కడికి చేరుకున్న పల్లవి ప్రశాంత్ అభిమానులు కృష్ణానగర్ లో ఆర్టీసీ బస్సులపై దాడులకు తెగబడ్డారు. అన్నపూర్ణ స్టూడియోలో కూడా డ్యామేజ్ చేశారు. ఈ రెండు ఘటనలపై బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అందులో ఒకటి 427 ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ కి సంబంధించింది కాగా.. రెండోది పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కి సంబంధించినది. ప్రశాంత్ పై 427 కేసు పెట్టడానికి కారణం ఫ్యాన్స్ ను తీసుకురావద్దని చెప్పిన తర్వాత కూడా తీసుకు వచ్చాడని అతడిపై కేసు నమోదైందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణానగర్ లో ఆర్టీసీ బస్సులపై దాడిలో గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నప్పటికి వీళ్లంతా ప్రశాంత్ కోసం వచ్చి వెళ్తున్న క్రమంలో దాడులకు పాల్పడ్డట్టు పోలీసులకు సమాచారం ఉందని తెలిసింది. అయితే 427 కేసులో రెండు అంశాలకు చెందిన డ్యామేజ్ లు కనిపిస్తుంటాయి.

ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ప్రాపర్టీ ధ్వంసం, రెండోది కేంద్ర ప్రభుత్వ ప్రాపర్టీ ధ్వంసం. కాగా స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసులో పల్లవి ప్రశాంత్ కు 3 ఏళ్లు శిక్ష పడే అవకాశం. అదే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ధ్వంసం కేసుల్లో రైల్వే సెక్షన్ల ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్షపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ కు 41 సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం నోటీసులు పంపిస్తామని ఒక వర్గం చెబుతుంది. ఒక సెలబ్రిటీ అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి తనే ఇలా ప్రవర్తించడం, ముందే ఫ్యాన్స్ ను తీసుకు రావద్దని చెప్పిన తర్వాత కూడా వినకుండా మొండిగా వ్యవహరించడంతో పోలీసులు ఆయనను రిమాండ్ కు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణానగర్ లో ఆర్టీసీ బస్సులపై జరిగిన దాడిపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ గా ఉన్నారు. దాడులకు పాల్పడిన వారిని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దాడులకు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మరి పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి