iDreamPost

OTTలోనూ గేమ్ ఆడిస్తారా బాస్

OTTలోనూ గేమ్ ఆడిస్తారా బాస్

ఎన్ని వివాదాలు విమర్శలు ఉన్నా బిగ్ బాస్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. తెలుగులోనే కొంత వీక్ గా ఉన్నప్పటికీ హిందీలో ఓ రేంజ్ లో జనం దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. 14వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ కు ఏకంగా 300 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నారంటేనే దీని పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సౌత్ లోనూ ఇదే స్థాయి రెస్పాన్స్ కోసం ట్రై చేస్తున్నారు కానీ ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఇదిలా ఉండగా ఓటిటి ప్రేక్షకుల కోసం సెపరేట్ బిగ్ బాస్ లు వస్తున్నాయి. ఇప్పటికే హిందీలో కరణ్ జోహార్ దీన్ని హోస్ట్ చేయగా 25 లక్షల ప్రైజ్ మనీతో ఆడియన్స్ దీన్ని కూడా ఆదరించినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ఒకరకంగా బడ్జెట్ వెర్షన్ అన్నమాట.

ఇప్పుడు ఇదే మోడల్ ని తెలుగులో కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం. కాకపోతే నాగార్జున ఓటిటిని కూడా డీల్ చేస్తారా లేక వేరే యాంకర్ ని సెట్ చేస్తారా వేచి చూడాలి. అసలు స్టార్ మాలో వీక్ డేస్ లోనే ఈ షో రేటింగ్స్ అంతంత మాత్రంగా ఉన్నాయి. వీకెండ్ లో నాగార్జున హడావిడి లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అలాంటిది ఓటిటిలో ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుందనే అనుమానం రావడం సహజం. టీవీ అయితే ఇబ్బందులు అడ్డంకులు ఉంటాయి కానీ అదే డిజిటల్ లో ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా గేమ్ ఆడించొచ్చు. బూతులకు కూడా సెన్సార్ అక్కర్లేదు. పైపెచ్చు 18 ప్లస్ అని ముందే కార్డు వేసేయొచ్చు.

ఇది నిజమో కాదో తెలియడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది. స్టార్ ఛానల్ ప్రణాళిక ఏంటో తెలియాల్సి ఉంది. ఓటిటిలకు పెరుగుతున్న ఆదరణ చూసి సినిమాలే కాకుండా ఇలాంటి ప్రోగ్రాంస్ ని కూడా విడిగా తీసే ఆలోచనలు నిర్మాతలు జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్ ల హవా జోరుగా సాగుతోంది. భవిష్యత్తులో సీరియళ్లు తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. సినిమాలు ఎలాగూ డైరెక్ట్ ప్రీమియర్లు అవుతున్నాయి. సో శాటిలైట్ ఛానల్స్ కి ధీటుగా ఓటిటి వ్యవస్థ బలంగా ఏర్పడబోతోందన్నది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం. ఇదంతా బాగానే ఉంది కానీ టీవీకే సరిగా దొరకని పార్టిసిపెంట్స్ ఓటిటికి ఎలా సెట్ చేస్తారో…..

Also Read : నేడే 50వ రోజు – కిక్కు కోరుతున్న టాలీవుడ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి