iDreamPost

బిగ్ బాస్ కూడా యావర్ కి అన్యాయం చేశాడు.. ప్రేక్షకులు మాత్రం..!

బిగ్ బాస్ కూడా యావర్ కి అన్యాయం చేశాడు.. ప్రేక్షకులు మాత్రం..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒక పేర బాగా వినిపిస్తోంది. అది మరెవరిదో కాదు.. ప్రిన్స్ యావర్ ది. ఒక కంటెస్టెంట్ గా యావర్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. అతడిని నిజంగానే హౌస్ లో టార్గెట్ చేస్తున్నారు అనే విషయం ఎపిసోడ్ 20 చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడన్నా వీక్ ఉన్నవాళ్లు ఓడిపోతారు. కానీ, ఇక్కడేంటో స్ట్రాంగ్ గా ఉన్నందుకు ప్రతిసారి యావర్ అవకాశాలు రాకుండా ఎలిమినేట్ అవుతున్నాడు. ఈసారి అయినా హౌస్ మేట్ అయ్యే అవకాశం దక్కించుకోవాలి అని ఎదురుచూసిన ప్రిన్స్ యావర్ కు నిరాశే మిగిలింది. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా ప్రిన్స్ ని స్ట్రాంగ్ అని చెప్పి పక్కన పెట్టేశారు. అయితే ఈసారి బిగ్ బాస్ కూడా యావర్ కు అన్యాయం చేశాడేమో అనిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఈ మధ్య ఏది జరిగినా కూడా పోరాడి గెలిచిన వాళ్లకు కాకుండా.. ఓడిపోయిన వారికి, వీక్ కంటెస్టెంట్స్ కి మాత్రమే డెసిషన్ తీసుకునే అవకాశం ఇస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే మహాబలి వర్సెస్ రణధీర టాస్కులో గెలిచిన టీమ్ లో ఎవరు కంటెండర్లు కావాలో ఓడిపోయిన వాళ్లను డిసైడ్ చేయమన్నారు. అలా చేయడం వల్ల ఆటలో కష్టపడి పోరాడిన ప్రిన్స్ యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్ వంటి వారికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న ముగ్గురు కంటెండర్లలో ప్రిన్స్ యావర్ ఎంతో కష్టపడ్డాడు. ముగ్గురు వ్యక్తులు కలిసి అతడిని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఆ విషయాన్ని ప్రేక్షకులు కూడా చూశారు. తర్వాత శోభాశెట్టి ఎంతో కష్టపడి స్పైసీ చికెన్ తినింది. అలాగే ప్రియాంక జైన్ తన జుట్టు కత్తిరించుకుంది.

ఇక్కడ టాస్కుల పరంగా చూసుకుంటే వరుసగా ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభాశెట్టి ఉంటారు. బిగ్ బాస్ కూడా ప్రిన్స్ యావర్ కు అన్యాయం చేశాడు అని ఎందుకు అంటున్నామంటే.. ముగ్గురిలో ఒక నిర్ణయం తీసుకోండి అంటే కచ్చితంగా ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అవుతాడని అందరికీ తెలుసు. అలా కాకుండా ఇంట్లోని సభ్యులకు అనర్హుడిని తప్పించండి అని ఓటింగ్ పెట్టుంటే ప్రిన్స్ యావర్ కు కచ్చితంగా అవకాశం దక్కేది. ఎందుకంటే.. శుభశ్రీ, గౌతమ్, పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ కచ్చితంగా యావర్ ఫైనలిస్ట్ కావాలి అని ఓటు వేసేవాళ్లు. ఇంక మిగిలిన ఓట్లలో శోభాశెట్టి, ప్రియాంకకు డివైడ్ అయ్యేవి. అలా చూసుకుంటే ప్రిన్స్ యావర్ కు అవకాశం దక్కేది. అతను స్ట్రాంగ్ కాబట్టి కచ్చితంగా ప్రిన్స్ యావర్ ఎక్కువసేపు ఉండేవాడు. ఫైనల్ గా హౌస్ మేట్ అయ్యేవాడు. కానీ, బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం వల్ల యావర్ కు అన్యాయం జరిగింది.

నిజానికి యావర్ కు ప్రేక్షకుల్లో చాలా మంచి స్థానం దక్కింది. ఇప్పటికే యావర్ సపోర్ట్ గా పేజ్ లు, అభిమాన సంఘాలు పుట్టుకొచ్చాయి. పైగా అతని బాధను వ్యక్తపరిచిన తీరు కూడా అందరికీ నచ్చింది. అతని కోపంలో ఎలాంటి తప్పులేదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సామాన్యులు ఎవరైనా అతనికి అన్యాయం జరిగింది అని నమ్మితే అలాగే రియాక్ట్ అవుతారు. అయితే శివాజీతో మాట్లాడిన మాటలు చూసి.. ప్రిన్స్ యావర్ సింపథీ గేమ్ ఆడుతున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి విషయం ఉండి ఓడిపోతున్నాడు అంటే ఎవరికైనా బాధ వస్తుంది. ప్రతిసారి కోపం, యాటిట్యూడ్ అనే పదాలు వాడుతుంటే.. కోపం పట్టలేక అతను ప్రాపర్టీని డ్యామేజ్ చేశాడు. ఆ బిహేవియర్ ప్రేక్షకులకు ఎందుకు నచ్చింది అంటే.. సామాన్యులు ఎవరైనా అలాగే ప్రవర్తిసారు కాబట్టి.

అతని దగ్గర డబ్బు లేదు అనే విషయం ఎవరికీ తెలీదు. ఆ పాయింట్ ని పట్టుకుని అతను సింపథీ గేమ్ ఆడుతున్నాడేమో అనే అనుమానాలను రైజ్ చేస్తున్నారు. అయితే హౌస్ లో అసలు సింపథీ పాయింట్ లేకుండా ఆడేవాళ్లు ఎవరూ లేరు. బిగ్ బాస్ లో సింపథీ కార్డు లేకుండా ఎవరూ ఆడరు కూడా. ఈ మొత్తం విషయంపై హోస్ట్ నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రిన్స్ యావర్ కు జరిగింది అన్యాయం అని చెబుతారా? లేక అతడినే తిడతారా? అనే విషయాలు చూడాలి. ఓట్ల పరంగా మాత్రం ప్రిన్స్ యావర్ దూసుకుపోతున్నాడు. తెలుగు ప్రేక్షకుల నుంచి యావర్ కు చాలా మంచి సపోర్ట్ లభిస్తోంది. ప్రిన్స్ యావర్ కు అన్యాయం జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి