iDreamPost

వీడియో: అమర్ దీప్ vs ప్రశాంత్.. కొట్టుకున్నంత పని చేశారు!

వీడియో: అమర్ దీప్ vs ప్రశాంత్.. కొట్టుకున్నంత పని చేశారు!

బిగ్ బాస్ హౌస్ గొడవలు, కేకలతో అట్టుడికిపోతోంది. రెండోవారం నామినేషన్స్ లో ఇంట్లోని సభ్యులు మొత్తం అసలు ఆట మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఏం మాట్లాడితో ఏం అనుకుంటారో? ఎవరిని ఎలా నామినేట్ చేయాలో అనుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఓపెన్ అయిపోయారు. కారణాలు చెబుతూ కేకలు వేసేశారు. అమర్ దీప్ అయితే కోపంతో ఊగిపోయాడు. పల్లవి ప్రశాంత్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. అసలు రైతు బిడ్డ అనే మాటను హౌస్ లో వాడద్దు అంటూ కామెంట్ చేశాడు. ఆటోవాళ్లు, రిక్షావాళ్లు కూడా కష్టాలు పడుతున్నట్లు చెప్పాడు. అలాగే బీటెక్ చేసి ఉద్యోగాలు లేక కష్టాలు పడుతున్న వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారన్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో మొదటివారం మొత్తం అసలు అమర్ దీప్ ఎక్కడా కనిపించలేదు అన్న మాటలకు రెచ్చిపోయాడో? లేక శివాజీ.. పల్లవి ప్రశాంత్ ని తోపు, తురుము అన్నందుకు సీరియస్ అయ్యాడో తెలీదు గానీ.. నామినేషన్స్ లో మాత్రం అమర్ దీప్ ఉగ్రరూపం దాల్చాడు. పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసినందుకు కారణాలు చెబుతూ కోపంతో రగిలిపోయాడు. పల్లవి ప్రశాంత్ ఎప్పుడూ చెప్పే రైతుబిడ్డ అనే కార్డుపై కూడా అమర్ దీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతిసారి హౌస్ లో ఆ మాట వాడద్దంటూ చెప్పుకొచ్చాడు. తనకి ఒక లక్ష రూపాయలు వస్తే వాటిని ఒక నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తాను అని ప్రశాంత్ చెప్పాడు. ఆ మాటల్ని అమర్ దీప్ ఖండించాడు. ఆ డబ్బు ఎందుకు ఒక ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇవ్వవు? ఎందుకు ఒక రిక్షా తొక్కే అతని కుటుంబానికి ఇవ్వవు అంటూ ప్రశ్నించాడు. అసలు బీటెక్ చేసి.. ఉద్యోగాలు లేక, తినడానికి తిండిలేక చచ్చిపోతే వాళ్ల శవాలు కూడా దొరకలేదని ఎమోషనల్ అయ్యాడు.

అమర్ దీప్ చేసిన వ్యాఖ్యలతో హౌస్ లో ఉన్న గౌతమ్, ఆట సందీప్, రతికా రోజ్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ ఏకీభవించారు. అమర్ దీప్ అలా చెప్పినప్పుడు చప్పట్లు కొట్టారు. అతను ప్రతిసారి రైతుబిడ్డ అనే మాట వాడద్దు అంటూ గౌతమ్ కృష్ణ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆట సందీప్ కూడా ఇక్కడ అందరూ రైతు బిడ్డలే అంటూ కౌంటర్ ఇచ్చాడు. అమర్ దీప్ మాట్లాడుతున్నప్పుడు పల్లవి ప్రశాంత్ పుష్ప స్టైల్ లో భుజం పైకెత్తి నిల్చున్నాడు. అలా చేయడంపై అమర్ దీప్ సీరియస్ అయ్యాడు. భుజం దించురా అంటూ అరిచేశాడు. ఇదే బాడీ లాంగ్వేజ్ తో ఎందుకు నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి పంపండి అని అడగలేదని ప్రశ్నించాడు. తాను పుట్టుకతో నటుడు అయితే.. పల్లవి ప్రశాంత్ నటన నేర్చుకుని హౌస్ లోకి అడుగు పెట్టినట్లు చెప్పాడు. మొత్తానికి వీళ్ల గొడవ చూస్తే.. అమర్ దీప్ ఆట మొదలినట్లు తెలుస్తోంది.

మొదటివారం ఎందుకో సైలెంట్ గా ఉన్న అమర్ దీప్ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చాడు. ఒక్క నామినేషన్ తో ఫుల్ హైలెట్ అయిపోయాడు. ఈ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రోమో చూసిన ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ సింపథీ గేమ్ ఆడుతున్నాడని కొందరు అంటే.. ఇంకొందరు మాత్రం రైతు బిడ్డ అని చెప్పుకోవడంలో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గౌతమ్ కృష్ణకు కూడా ఈ ప్రోమో పాజిటివ్ టాక్ తీసుకొచ్చింది. పల్లవి ప్రశాంత్ విషయంలో గౌతమ్ కృష్ణ వ్యాలిడ్ పాయింట్ పట్టుకున్నాడని చెప్పాడు. ఈ మొత్తం గొడవ పల్లవి ప్రశాత్ కే నెగిటివ్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అతను సింపథీ గేమ్ ఆడుతున్నాడు అంటున్నారు. అలాగే ఎలిమినేట్ అయిన కిరణ్ రాథోర్ కూడా పల్లవి ప్రశాంత్ పక్కాగా ప్రిపేర్ అయ్యాకే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు అంటూ చెప్పిన మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి.. అమర్ దీప్- పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి