iDreamPost

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 2024

లోక్‌స‌భ స్థానాలు

543

సాధార‌ణ మెజార్టీ

272
పార్టీ ఆధిక్యం / గెలుపు
బిజెపి+
కాంగ్రెస్+
టీఎంసీ
బి.జె.డి
ఇత‌రులు
Total :0

తెలంగాణ లోక్‌స‌భ 2024

లోక్‌స‌భ స్థానాలు

17

సాధార‌ణ మెజార్టీ

0
పార్టీ ఆధిక్యం / గెలుపు
బిఆర్ఎస్
బిజెపి
కాంగ్రెస్
ఏంఐఏం
ఇత‌రులు
Total : 0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ 2024

శాస‌న‌స‌భ స్థానాలు

175

సాధార‌ణ మెజార్టీ

88
పార్టీ ఆధిక్యం / గెలుపు
వైఎస్ఆర్సీపీ
తెలుగుదేశం
జ‌న‌సేన‌
బిజెపి
కాంగ్రెస్
ఇత‌రులు
Total : 0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోకసభ 2024

లోక్‌స‌భ స్థానాలు

25

సాధార‌ణ మెజార్టీ

0
పార్టీ ఆధిక్యం / గెలుపు
వైఎస్ఆర్సీపీ
కాంగ్రెస్+
తెలుగుదేశం
జ‌న‌సేన‌
బిజెపి
ఇత‌రులు
Total : 0

Star Candidates

Bigg Boss 7 Telugu: వర్మ చూశాను.. సుబ్బు – గౌతమ్ లవ్ ట్రాక్! వర్త్ వర్మ!

Bigg Boss 7 Telugu: వర్మ చూశాను.. సుబ్బు – గౌతమ్ లవ్ ట్రాక్! వర్త్ వర్మ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి ప్రేక్షకుల్లో లవ్ ట్రాక్ విషయంలో మాత్రం కాస్త నిరాశ ఉంది. ఎందుకంటే ప్రతి సీజన్ లో కచ్చితంగా ఒక్క జంట అయినా ఉండేది. కానీ, ఐదోవారంలోకి అడుగుపెట్టినా కూడా ఇంకా హౌస్ లో కరెక్ట్ లవ్ ట్రాక్ లేదనే చెప్పాలి. రతికా రోజ్ బయటకు వచ్చేసిన తర్వాత అసలు లవ్ ట్రాక్ కనెక్ట్ అయ్యే స్కోప్ కూడా కనిపించడం లేదు. అలాంటి సమయంలో సుబ్బు- గౌతమ్ ఏదో కాస్త ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాళ్ల మధ్య ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రోమోలో సాంగులు వేస్తూ ఏదో ఉంది అనే భావన అయితే బిగ్ బాస్ కలిగిస్తున్నాడు.

తాజాగా సుబ్బు- గౌతమ్ కృష్ణ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. నేనే మాట్లిడితే ఇష్టంలేదా? అంటూ సుబ్బు క్యూట్ గా అడుగుతుంది. అందుకు గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టే బరిస్తున్నా అంటూ కామెంట్ చేస్తాడు. అందరి మనోభావాలు నేనే దెబ్బతీస్తున్నాను అంటూ సుబ్బు క్యూట్ గా వెళ్లిపోతుంది. తర్వాత ఇద్దరూ ఫ్రెండ్ షిప్ కొద్దీ హగ్ చేసుకుంటూ కనిపించారు. అయితే ఇది చూసిన ఆడియన్స్ మాత్రం హౌస్ లో లవ్ ట్రాక్ వచ్చేస్తోంది అంటూ సంబరపడిపోతున్నారు. అయితే గౌతమ్- శుభశ్రీకి కచ్చితంగా ఇది కంటెంట్ పరంగా పాజిటివ్ అవుతుందనే చెప్పాలి. శుభశ్రీ కూడా మొదటి నుంచి గౌతమ్ విషయంలో పాజిటివ్ గానే ఉంటోంది. పైగా యావర్ మాట్లాడుతూ.. మనం ఫ్రెండ్స్ కదా నువ్వు గౌతమ్ తో మాట్లాడకు అంటూ చెప్పినప్పుడు ఆ సరే అనింది. కానీ, గౌతమ్ తో ఇంకా ఎక్కువగా మాట్లాడుతోంది.

దీన్ని బట్టే వారి మధ్య కచ్చితంగా లవ్ ట్రాక్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అది లవ్ ట్రాక్ అవుతుందా? లేక నామినేషన్ వరకు వెళ్తుందా అనేది చూడాలి మరి. ఇంక హౌస్ లో గేమ్ విషయానికి వస్తే.. అందరి పవరాస్త్రాలను తీసేసుకున్నారు. ఇంక అందరూ కంటెస్టెంట్స్ అవుతారనే భావనతో అలా చేశారేమో చూడాలి. ఇక్కడే ఉల్టా పుల్టా సీజన్ స్టార్ట్ కాబోతోంది అనే సందేశాన్ని కూడా ఇస్తున్నట్లు అయింది. దాదాపు వచ్చే వారం కొత్త సభ్యుల ఎంట్రీ ఉంటుందని గట్టిగానే బజ్ వస్తోంది. అదే జరిగితే ఆట మరింత రసవత్తరంగా మారుతుంది. అలాగే హౌస్ లో గొడవలు మరింతగా జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి అసలు ఆట ఇప్పుడే మొదలు అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొత్త సభ్యుల ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని హోస్ట్ నాగార్జున కూడా హింట్ ఇచ్చారు. మీరు ఊహించనవి కూడా ఈ సీజన్ లో జరుగుతాయని. మరి.. సుబ్బు- గౌతమ్ మధ్య లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి