iDreamPost

Bigg Boss 7 Telugu: వీడియో: బిగ్ బాస్ కుస్తీ.. గెలిస్తే 5 వారాలు హౌస్ లోనే..!

Bigg Boss 7 Telugu: వీడియో: బిగ్ బాస్ కుస్తీ.. గెలిస్తే 5 వారాలు హౌస్ లోనే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. ఉల్టా పుల్టా అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా అంశాల్లో ఆ విషయాన్ని ప్రూవ్ చేశారు. మొదటిరోజే సూట్ కేస్ పంపినప్పుడే ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఈ సీజన్ లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని. అలా ఎవరైతే అనుకున్నారో వాళ్ల గెస్ కరెక్టే. ఎందుకంటే మరోసారి అలాంటి ఒక టాస్కుతో బిగ్ బాస్ అందరికీ షాకిచ్చాడు. బిగ్ బాస్ కుస్తీ అనే టాస్కు పెట్టి 5 వారాల ఇమ్యూనిటీ ఇస్తానని ప్రకటించాడు. నిజానికి ఏ టాస్కులో గెలిచినా మహా అయితే ఒక వారం మాత్రమే ఇమ్యూనిటీ ఇస్తారు. కానీ, ఈసారి ఒకేసారి 5 వారాలు అనగానే అంతా షాకయ్యారు.

బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఎంత కష్టంగా ఉంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆయన శాడిజాన్ని చూశాం కాబట్టి. ఇప్పుడు 5 వారాల ఇమ్యూనిటీ ఇస్తున్నాడు అంటే అంత తేలిగ్గా ఎందుకు వదిలేస్తాడు. అందుకే భారీ భారీ దేహాలు కలిగిన ఇద్దరు రెజ్లర్లను హౌస్ లోకి తీసుకొచ్చారు. వారితో కంటెస్టెంట్స్ కి కుస్తీ పోటీలు నిర్వహించారు. ఒక లేడీ రెజ్లర్, ఒక మేల్ రెజ్లర్ ను తీసుకొచ్చారు. ఇద్దరూ మామూలుగా లేరు. నిజానికి వాళ్లని చూడగానే కంటెస్టెంట్స్ లో కాన్ఫిడెన్స్ సగం చచ్చిపోయింది. అందరూ పోటీకి ముందే చేతులెత్తేశారు. షకీలా అయితే నేను మగ రెజ్లర్ తో అయినా పోటీ పడతాను కానీ.. ఆ లేడీ రెజ్లర్ తో కుస్తీ చేయను అని చెప్పేసింది.

ఇక శివాజీ అయితే మ్యాట్ మీదకు రాగానే దండం పెట్టేశాడు. ప్రిన్స్ యావర్, ఆట సందీప్ మాత్రం వాళ్లతే తలపడినట్లు చూపించారు. కిరణ్ రాథోర్ ఉత్సాహం చూసి.. బిగ్ బాస్ ముందు ఆమెతోనే స్టార్ట్ చేశాడు. 5 వారాల ఇమ్యూనిటీ అనగానే ఎవరు ఈ టాస్కులో విజయం సాధించారు? అని అంతా ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ ప్రశ్న సమాధానం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు గెలిచే అవకాశం ఉంటే బిగ్ బాస్ ఆ టాస్కు పెట్టేవాడు కాదు. గెలుస్తారు అనుకుంటే 5 వారాల ఇమ్యూనిటీని ఇస్తానని చెప్పేవాడే కాదు. కాబట్టి ఈ టాస్కులో ఎవరూ గెలిచే అవకాశం లేదు. నిన్న 24*7 లైవ్ స్ట్రీమింగ్ లో పూర్తి టాస్కును చూపించలేదు.

ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ బల ప్రదర్శనను చూపిస్తారు. ఈ సీజన్ లో అన్నీ విషయాలను లైవ్ స్ట్రీమింగ్ లో రివీల్ చేయడం లేదు. ఎందుకంటే రాత్రి టెలికాస్ట్ చేసే ఎపిసోడ్ పై ఆసక్తి ఉండదని ఈ సీజన్ నుంచి కొత్తగా ఇలా ట్రై చేస్తున్నారు. అసలు లైవ్ స్ట్రీమింగ్ తీసేయాలని.. దాని వల్ల ఎపిసోడ్ మీద ఇంట్రస్ట్ రావడం లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. పూర్తిగా తీసేయకపోయినా.. బిగ్ బాస్ చేస్తున్నది కాస్త పర్వాలేదంటూ చెబుతున్నారు. మరి.. ఈ ప్రోమో ప్రకారం బిగ్ బాస్ కుస్తీలో ఎవరు విజయం సాధించి ఉంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి