iDreamPost

అమర్ ని టార్గెట్ చేశారా? కెప్టెన్ గా ఓడించినా కప్పుకు దగ్గర చేశారు!

బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒక కెప్టెన్ అవ్వాలి. ఈ వారం ప్రియాంక కెప్టెన్ గా గెలిచింది. అయితే ఆఖరు వరకు వచ్చి అమర్ దీప్ ఆటలో ఓడిపోయాడు. కానీ, ఆడియన్స్ హృదయాలు మాత్రం గెలుచుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒక కెప్టెన్ అవ్వాలి. ఈ వారం ప్రియాంక కెప్టెన్ గా గెలిచింది. అయితే ఆఖరు వరకు వచ్చి అమర్ దీప్ ఆటలో ఓడిపోయాడు. కానీ, ఆడియన్స్ హృదయాలు మాత్రం గెలుచుకున్నాడు.

అమర్ ని టార్గెట్ చేశారా? కెప్టెన్ గా ఓడించినా కప్పుకు దగ్గర చేశారు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో శుక్రవారం ఎపిసోడ్ చాలారోజులు గుర్తుండిపోతుంది. కెప్టెన్సీ పోటీదారుల మధ్య జరిగిన టాస్కులో విజయం సాధించి ప్రియాంక ఈ వారం కొత్త కెప్టెన్ అయ్యింది. అయితే ఆఖరి రౌండ్ లో అమర్ దీప్ ని ఓడించి హౌస్ మేట్స్ ప్రియాంకను కెప్టెన్ చేశారు. మీరు సాధారణంగా సినిమాల్లో ఒక డైలాగ్ వింటూ ఉంటారు. వాళ్లు కప్పు గెలిస్తే.. మనం హృదయాలు గెలిచాం అని. నిజానికి అమర్ విషయంలో అది నిజంగా నిజమనే చెప్పాలి. అతడిని అందరూ కలిసి టార్గెట్ చేసి ఓడించారు అనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఆట అలాగే ఉంటుంది. బలవంతుడినే బలంగా కొడతారు. ఒక్కోసారి బలంచాలకపోతే అందరూ కలిసి కొడతారు. అమర్ ని కూడా అంతే టార్గెట్ చేసి కొట్టారు.

అమర్ దీప్- ప్రియాంక ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నప్పుడు హౌస్ మేట్స్ లో మాత్రమే కాదు.. ఆడియన్స్ లో కూడా ఒక ప్రశ్న వచ్చింది. శోభాశెట్టి, అర్జున్, గౌతమ్ సపోర్ట్ ఎవరికి? ఎందుకంటే వీళ్లు వీళ్లు బాగా క్లోజ్ కాబట్టి ఈ ప్రశ్న అందరికీ వచ్చింది. అయితే శోభా మాత్రం అమర్ కి సపోర్ట్ చేసింది. ప్రియాంక టవర్ ని కొట్టాల్సి వస్తోంది అంటూ కాసేపు ఏడ్చింది కూడా. ఇంక గౌతమ్ మాత్రం తాను అనుకున్న పాయింట్ మీద స్టాండ్ తీసుకున్నాడు. తన చెల్లిని కెప్టెన్ చేయాలి అనుకున్నాడు. అదే పాయింట్ మీద నిలబడ్డాడు. చివరికి కెప్టెన్ ని కూడా చేసుకున్నాడు. అయితే ఇంకో వ్యక్తి కూడా అమర్ ని టార్గెట్ చేశారు. మరెవరో కాదు రతికా రోజ్. ఈ మధ్య మూడు వారాలుగా యావర్- అమర్ గొడవతో రతికా రోజ్ బాగా ఇరుకునపడింది. ఆ అక్కసును ఇలా తీర్చుకున్నట్లు కనిపించింది.

అర్జున్ కూడా అమర్ కు ఎక్కడా సాయం చేసింది లేదు. అమర్ టవర్ గట్టిగానే కొట్టాడు. ఇంక పల్లవి ప్రశాంత్ అయితే ఎవరి టవర్ ని కొట్టలేదు. శివాజీ స్టార్టింగ్ లో ఆడినా కూడా తర్వాత ఆడలేదు. పల్లవి ప్రశాంత్.. అమర్ కు సపోర్ట్ గా నిలిచాడు. అమర్ ని ఏడవద్దు అంటూ చెప్పుకొచ్చాడు. శోభాశెట్టి కూడా అమర్ ని పోరాడాలంటూ సూచించింది. అమర్ మాత్రం బాగా బాధ పడ్డాడు. కేకలు వేశాడు, బితమాలాడాడు, అర్దించాడు.. చివరికి ఓడిపోయాడు. ప్రియాంక టవర్ ని కూడా చాలా మంది కొట్టారు. కానీ, ఎక్కడా కూడా ఆమెను ఓడించాలి అనే ఉద్దేశంలో కొట్టలేదు. కానీ, అమర్ ని కావాలనే టార్గెట్ చేసినట్లు క్లియర్ గా కనిపించింది. అందరూ కలిసి ఒక్కటై ఓడించారు అనే ఫీలింగ్ కలిగింది. అందుకే ఇప్పుడు ఆడియన్స్ లో అమర్ గ్రాఫ్ బాగా పెరిగిపోయింది. బిగ్ బాస్ కూడా అమర్ మీరు బాగా ఆడారు.. మీకు అభినందనలు అంటూ చెప్పాడు.

ఆట పూర్తైన తర్వాత అమర్ ను అందరూ కలిసి ఓదార్చారు. ప్రియాంక కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. అమర్ నువ్వు గెలిచినా నేను ఆనందంగా ఉండేదాన్ని.. కానీ, నువ్వు మాత్రం అంత హ్యాపీ లేవు. నాకు అది చాలా హర్టింగ్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ అమర్ ని అందరూ టార్గెట్ చేశారు అనే ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా రియాక్ట్ కాలేదు. మొత్తానికి కొత్త కెప్టెన్ ప్రియాంక అయింది. కెప్టెన్సీ రేసులో అమర్ ఓడినా కూడా ఆడియన్స్ దృష్టిలో మాత్రం గెలిచాడనే చెప్పాలి. పైగా ఈ సీజన్ మొత్తంలో అమర్ దీప్ కి ఇది చాలా మంచి పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది. అమర్ ఆటని కచ్చితంగా నాగార్జున కూడా మెచ్చుకుంటారు. వీకెండ్ ఎపిసోడ్ లో అమర్ గ్రాఫ్ మరింత పెరిగే స్కోప్ ఉంది. మరి.. అమర్ దీప్ ని అందరూ కలిసి టార్గెట్ చేశారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి