iDreamPost

అవినాష్ ఔట్ – హౌసులో కొత్త ట్విస్టులు

అవినాష్ ఔట్ – హౌసులో కొత్త ట్విస్టులు

అందరూ ఊహించినట్టే తన అతి పెర్ఫార్మన్స్ కు తగ్గ మూల్యాన్ని అవినాష్ చెల్లించాడు. గతంలోనే ఎలిమినేట్ కావాల్సి ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సేవ్ అవుతూ వచ్చిన ఇతన్ని ఎట్టకేలకు సాగనంపక తప్పలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో మొన్నే లీక్ కావడంతో థ్రిల్ తగ్గింది. ఇక టాస్కుల విషయానికి వస్తే నిన్న నాగార్జున యారొంకి యార్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. ప్రశ్నలకు సమాధానాలు వైట్ బోర్డ్ మీద రాసి ఫైనల్ గా ఎవరి చేతిలో ఎక్కువ పువ్వులు ఉంటే వాళ్ళు విజేతగా నిలవడం అన్నది ఇందులో మెయిన్ పాయింట్. ఇందులో భాగంగా మోనాల్ ని అవినాష్ ని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నావ్ అని అడగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దానికి మోనాల్ బదులు చెపుతూ మూడుసార్లు అని చెప్పగా అది అవినాష్ చెప్పిన ఆన్సర్ తో కూడా మ్యాచ్ అవ్వడం అసలు ట్విస్ట్. అయితే ఈ ఇద్దరిదీ అన్నాచెల్లెళ్ళ అనుబంధం అని సోహైల్ అఖిల్ కౌంటర్ వేయడం నవ్వుల్ని పూయించింది. మొత్తంగా ఈ రౌండ్ పూర్తయ్యేసరికి సొహైల్ విన్నర్ గా గెలిచి అందరి బందువయా ట్యాగ్ ని సంపాదించుకున్నాడు. ఇక నామినేషన్స్ లో నలుగురికి నాగార్జున ఆవు టాస్కును ఇచ్చారు. ఎవరైతే దాంతో అంబా అనిపిస్తారో వాళ్ళు సేఫ్ అని ప్రకటించారు. ముందు కుక్క, కాకి, ఏనుగు సౌండ్లు వినిపించగా రెండో ట్రయిల్ లో అభిజిత్ ఆవు పుణ్యమాని ఎలిమినేషన్ నుంచి రక్షింపబడ్డాడు.

తర్వాత కాసేపు కమర్షియల్ గేమ్ లో భాగంగా సభ్యులంతా ఆటాపాటలతో సందడి చేశారు. నెక్స్ట్ విజిల్స్ టాస్కు ఇచ్చారు. దీని వల్ల హారిక సేవ్ అయ్యింది. ఫైనల్ గా అవినాష్ మోనాల్ లు మిగిలారు. టెస్ట్ ట్యూబ్ బౌల్ అనే కాన్సెప్ట్ ద్వారా మోనాల్ ని గట్టెక్కించారు. ఈ సందర్భంగా మోనాల్ మళ్ళీ ఏడ్చేసింది. వెళ్ళడానికి ముందు అవినాష్ అందరిని మిమిక్రీ చేసి నవ్వించాడు. నాగ్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్టు కనిపించింది. ఏ పని చేయకుండా ఉండే తనకిచ్చిన బాంబుని అవినాష్ అభిజిత్ మీద వేసేసి సెలవు తీసుకున్నాడు. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే జరగబోతున్న నేపధ్యంలో ఇవాళ నుంచి ఇంకా కొత్త మలుపులు జరగనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి