iDreamPost

Bheemla Nayak : పవన్ సినిమాకు పెద్ద కోత ?

Bheemla Nayak : పవన్ సినిమాకు పెద్ద కోత ?

ఇంకో నెల రోజుల దాకా భారీ సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ప్రస్తుతానికి వినిపిస్తున్న పేర్లు రెండే. ఒకటి రవితేజ ఖిలాడీ. రెండు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్. పవర్ స్టార్ మూవీ ఫిబ్రవరి 25 విడుదలను ఆల్రెడీ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏమైనా మార్పు ఉంటుందేమోనని గత కొద్దిరోజులుగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా టెన్షన్ పడుతున్నారు. అయితే అలాంటి ఆలోచనేదీ లేదని చెప్పిన డేట్ కే తప్పకుండా రిలీజవుతుందని ప్రొడక్షన్ హౌస్ నుంచి మరోసారి కన్ఫర్మేషన్ వచ్చింది. అఫీషియల్ గా మళ్ళీ చెప్పలేదు కానీ ఇందులో అనుమానించడానికి ఏమి లేదు. బ్యాలన్స్ ఉన్న ప్యాచ్ వర్క్ కూడా దాదాపు పూర్తి చేశారని తెలిసింది.

ఫైనల్ వెర్షన్ ని కేవలం 2 గంటల 12 నిమిషాలకు లాక్ చేశారని తాజాగా వినిపిస్తున్న అప్ డేట్. మలయాళం ఒరిజినల్ అయ్యప్పనుం కోషియం మూడు గంటలకు దగ్గరగా ఉంటుంది. అంటే ఈ లెక్కన తెలుగులో సుమారు 50 నిమిషాలకు పైగానే కోత వేశారన్న మాట. పైగా ఇక్కడ పాటలు, నిత్య మీనన్ తో ఒక చిన్న లవ్ ట్రాక్ అదనంగా ఉంటుంది. మరి ఇంత షార్ట్ అండ్ సింపుల్ గా ఒరిజినల్ ఫీల్ తీసుకురాగలరా అనే డౌట్ రావడం సహజం. అయ్యప్పనుంలో లెంగ్త్ ఎక్కువగా ఉండటానికి కారణం అందులో ల్యాగ్. అక్కడి ఆడియన్స్ దాన్ని భరిస్తారు. కానీ తెలుగులో అలా వర్కౌట్ కాదు. అందుకే స్క్రీన్ ప్లే రేసీగా ఉండేలా సెట్ చేశారట.

సో భీమ్లా నాయక్ కు సంబంధించి రన్ టైం అనేది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఒక అదనపు షో వేసుకోవడానికి కూడా వెసులుబాటు దొరుకుతుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ ఈగో డ్రామాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు సమకూర్చారు. తమన్ పాటలు ఇప్పటికే ఛార్ట్ బస్టర్ అయ్యాయి. పవన్ కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందని ఇటీవలే తమన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో ఫ్యాన్స్ మధ్య తిరుగుతోంది. బాక్సాఫీస్ బాగా డల్ గా ఉన్న తరుణంలో పవన్ రవితేజ లాంటి స్టార్ల సినిమాలు వస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. థర్డ్ వేవ్ కనక త్వరగా నెమ్మదిస్తే ఇంకొన్ని రిలీజ్ డేట్లు త్వరగా బయటికి వస్తాయి

Also Read : Allu Arjun : ఇంకో పాన్ ఇండియా ప్లాన్ లో బన్నీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి