iDreamPost

Bheemla Nayak : ఇంత హఠాత్ నిర్ణయం ఎలా తీసుకున్నారు

Bheemla Nayak : ఇంత హఠాత్ నిర్ణయం ఎలా తీసుకున్నారు

ఊహించని విధంగా ఉన్నట్టుండి భీమ్లా నాయక్ విడుదలని ఫిబ్రవరి 25కి కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేయడం అభిమానులనే కాదు ఇండస్ట్రీకి సైతం షాక్ ఇచ్చింది. ఉదయం వరుణ్ తేజ్ గని తాలూకు ప్రకటన ఇంకా ఫ్రెష్ గా ఉండగానే సితార సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీళ్ళతో సంప్రదించాకే గీత ఆర్ట్స్ టీమ్ గని రిలీజ్ ని ఫిక్స్ చేసుకుందనే అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడీ అనూహ్య నిర్ణయం మాత్రం పెద్ద ట్విస్టు.దీనికే కాదు గత రెండు మూడు రోజులుగా ప్రమోషన్ల స్పీడ్ పెంచిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు బృందం కూడా ఇప్పుడీ పరిణామంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడింది.

నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ప్రసాద్ ల్యాబ్ కు త్రివిక్రమ్,రాధాకృష్ణతో భీమ్లా నాయక్ కు సంబంధించిన కీలక సభ్యులు హడావిడిగా రావడం చూసే అందరికీ అనుమానం కలిగింది. అప్పటికి అనౌన్స్ మెంట్ రాలేదు. అంటే బాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ తో పాటు రీ రికార్డింగ్ వ్యవహారాలు చక్కబెట్టడానికే అప్పటికప్పుడు ఉరుకులు పరుగులు మీద వచ్చారని అర్థమవుతోంది. చేతిలో ఉన్నది కేవలం 9 రోజులు మాత్రమే. మిగిలిన వాళ్లకు అవసరం కానీ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా హైప్ పెంచాల్సిన పని లేదు. ఇప్పటికే కావాల్సినంత ఉంది. రికార్డు ఓపెనింగ్స్ ఖాయమనే అంచనాతో డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

ఒక ప్లాన్ ప్రకారం షెడ్యూల్ కావలసిన భీమ్లా నాయక్ లాంటి పెద్ద సినిమాలు ఇలా హాఠాత్ నిర్ణయాలు తీసుకుంటే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వెనక్కు తగ్గడం తప్ప గనికి వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. పవన్ తో ఢీకి వరుణ్ తేజ్ ఒప్పుకుంటాడని అనుకోలేం. ఆడవాళ్ళూ మీకు జోహార్లు టార్గెట్ ఆడియన్స్ వేరు కాబట్టి అది వచ్చినా ఆశ్చర్యం లేదు. 24న వలిమైతో కలుపుకుని వచ్చే వారం సందడి ఓ రేంజ్ లో ఉండబోతోంది. భీమ్లా నాయక్ ప్రీమియర్లు, బెనెఫిట్ షోలు, టికెట్ రేట్లు తదితర వ్యవహారాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి భీమ్లా నాయక్ ఇచ్చిన ఝలక్ తో సోషల్ మీడియా సైతం ఊగిపోయింది

Also Read : బప్పీలహరి – స్వర్గానికేగిన సంగీత కిరణం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి