iDreamPost

తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం!

  • Author Soma Sekhar Published - 08:17 AM, Mon - 16 October 23
  • Author Soma Sekhar Published - 08:17 AM, Mon - 16 October 23
తీవ్ర విషాదం.. గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం!

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోట్లు ఆందోళన పరుస్తున్నాయి. గత కొంతకాలంగా సినీ నటులు, రాజకీయ ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజలు సైతం గుండెపోటు బారినపడుతూ.. తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆమెకు ఛాతిలో తీవ్రమైన నొప్పిరావడంతో.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచారు.

తెలంగాణలో ఎన్నికల వేళ తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో భద్రాచతం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి మరణించారు. ఆదివారం అర్దరాత్రి సమయంలో ఆమెకు తీవ్రమైన ఛాతి నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్ప్రత్రికి తరలిస్తుండగా మరణించారు. కాగా.. సత్యవతి కాంగ్రెస్ తరపున 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో.. కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతర రాజకీయ పరిణామాల వల్ల 2017లో బీజేపీలో జాయిన్ అయ్యి.. 2019లో ఆ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయారు. సత్యవతి మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె హఠాన్మరణంతో.. కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి