iDreamPost

IPL 2024 Mini Auction: IPL మినీ వేలంలో 6 బెస్ట్ పిక్స్‌ ఇవే! మేటి ప్లేయర్లను పట్టేసిన టీమ్స్‌

  • Published Dec 20, 2023 | 1:44 PMUpdated Dec 20, 2023 | 1:44 PM

ఐపీఎల్‌ 2024 కోసం నిర్వహించిన వేలంలో కొంతమంది ఆటగాళ్లకు కలలో కూడా ఊహించని మొత్తం చెల్లిస్తూ.. ఫ్రాంచైజ్‌లు కొనుగోలు చేశాయి. వాటిలో భారీ ధరను పక్కనపెడితే.. బెస్ట్‌ కొనుగులు అనే ఓ ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024 కోసం నిర్వహించిన వేలంలో కొంతమంది ఆటగాళ్లకు కలలో కూడా ఊహించని మొత్తం చెల్లిస్తూ.. ఫ్రాంచైజ్‌లు కొనుగోలు చేశాయి. వాటిలో భారీ ధరను పక్కనపెడితే.. బెస్ట్‌ కొనుగులు అనే ఓ ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. వాళ్ల ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 20, 2023 | 1:44 PMUpdated Dec 20, 2023 | 1:44 PM
IPL 2024 Mini Auction: IPL మినీ వేలంలో 6 బెస్ట్ పిక్స్‌ ఇవే! మేటి ప్లేయర్లను పట్టేసిన టీమ్స్‌

ఐపీఎల్‌ 2024 కోసం మంగళవారం జరిగిన మినీ వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై కోట్లు కురిపించాయి. ఐపీఎల్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ధరను పలికాడు.. ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌. ఏకంగా 24.75 కోట్లకు స్టార్క్‌ను కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కొనుగోలు చేసింది. అలాగే మరో ఆసీస్‌ ప్లేయర్‌ ప్యాట్‌ కమిన్స్‌ సైతం రూ.20.50 కోట్ల ధర పలికాదు. కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుంది. అయితే.. వీరికి ధర బాగా పలికినా.. వీళ్ల కంటే కూడా బెస్ట్‌ పిక్‌ వేరే ఉన్నాయి. జట్టు పరిస్థితులు, వాళ్ల క్యాపబిలిటీస్‌, టీమ్‌లో వాళ్ల రోల్స్‌, వాళ్లకు దక్కిన ధర ఇవన్నీ కలిపి.. ఓ ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయడం బెస్ట్‌ ఆక్షన్‌గా క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఆ ఆరుగురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ముందుగా న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ రచిన్‌ రవీంద్ర గురించి మాట్లాడుకోవాలి. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఈ యంగ్‌స్టర్‌ అద్భుతంగా రాణించాడు. ఇండియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో.. ఇతనిపై ఐపీఎల్‌ వేలంలో కోట్లు కుమ్మరిస్తాయని అంతా అనుకున్నారు. కానీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎంతో స్ట్రాటజీగా ఆలోచించి.. రచిన్‌ను కేవలం రూ.1.80 కోట్లకు దక్కించుకుంది. అంబటి రాయుడు రిటైర్మెంట్‌ తర్వాత.. సీఎస్‌కేకు మిడిల్‌ ఆర్డర్‌లో రచిన్‌ లాంటి ఆల్‌రౌండర్ రాకతో టీమ్‌ మరింత స్ట్రాంగ్‌ అవుతుంది. అలాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను రూ.6.80 కోట్లు దక్కించుకుంది. నిజానికి వరల్డ్‌ కప్‌లో హెడ్‌ ఆడని ఆటకు ఇంకా ఎక్కువ ధర రావాలి. కానీ, లక్కీగా 6.8 కోట్లకే ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌ను తీసుకుంది. హెడ్‌ రాకతో డేవిడ్‌ వార్నర్‌కు మంచి రీప్లేస్‌మెంట్‌ దొరికినట్లు అయింది.

ఇక గెరాల్డ్ కోయెట్జీని ముంబై ఇండియన్స్ కేవలం రూ.5 కోట్లకే సొంతం చేసుకుంది. మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, అల్జరీ జోసెఫ్‌ లాంటి ప్లేయర్లు కోట్లకు కోట్లు పలుకుతున్న చోటు.. సౌతాఫ్రికా యంగ్‌ పేసర్‌, ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న గెరాల్డ్‌ కోయెట్జీని ముంబై రూ.5 కోట్లకే దక్కించుకుని మంచి పిక్‌ అనిపించుకుంది. అలాగే గుజరాత్‌ టైటాన్స్‌ భారత యంగ్‌ క్రికెటర్‌ షారుఖ్‌ ఖాన్‌ను రూ.7.40 కోట్లకు కొనుగోలు చేసింది. ధర కాస్త ఎక్కువగా అనిపిస్తున్నా.. దేశవాళి క్రికెట్‌తో పాటు, ఐపీఎల్‌లో షారుఖ్‌ ఖాన్‌ ఆడుతున్న తీరు చూస్తే.. గుజరాత్‌ మంచి ప్లేయర్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసిందనే చెప్పాలి. గతంలో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడిన షారుఖ్‌ ఖాన్‌.. లోయర్‌ ఆర్డర్‌లో అద్భుతంగా రాణించాడు. హార్ధక్‌ పాండ్యా లేని లోటును బ్యాటింగ్‌లో షారుఖ్‌ ఖాన్‌ తీరుస్తాడని గుజరాత్‌ గంపెడశాలు పెట్టుకుంది.

అలాగే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కేఎస్‌ భరత్‌ను కొనుగోలు చేయడం కూడా మంచి పిక్‌అప్‌గా చెప్పుకోవచ్చు.. ఆ జట్టులో రహమనుల్లా గుర్బాజ్‌ రూపంలో ఫారెన్‌ వికెట్‌ కీపర్‌ ఉన్నాడు. ఇప్పుడు భరత్‌ను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకోవడంతో కేకేఆర్‌ మంచి బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ను చాలా చీప్‌గా కొనుగోలు చేసినట్లే. భరత్‌ రాకతో ఆ జట్టుకు బెస్ట్‌ కీపర్‌ ఆప్షన్‌ దొరికింది. పైగా టీమ్‌ కాంబినేషన్‌ కూడా బాగా కుదిరే అవకాశం ఉంది. ఇక చివరి బెస్ట్‌ పిక్‌అప్‌ గురించి చెప్పాలంటే.. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌. ఈ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్‌ కేవలం రూ.4 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో బ్రూక్‌ను భారీ ధర పెట్టి కొన్న విషయం తెలిసిందే. కానీ, ఈ సీజన్‌కు బ్రూక్‌ కేవలం రూ.4 కోట్లకే దొరకడం, సరైన టైమ్‌లో ఢిల్లీ బ్రూక్‌ను తీసుకోవడం మంచి పిక్‌గా చెప్పవచ్చు. మరి ఈ ఆరుగురు ఆటగాళ్లు.. తక్కువ ధరకు దొరకడం, ఆయా టీమ్స్‌లో వీరి అవసరం బాగా ఉండటంతోనే ఇవి మంచి పిక్స్‌గా పరిగణిస్తున్నారు క్రికెట్‌ నిపుణులు. అంతేకానీ, భారీ ధర వచ్చినంత మాత్రానా అవి మంచి పిక్స్‌ కావు. మరి ఈ ఆరుగురి ఆటగాళ్ల కొనుగోలుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి