iDreamPost

పుచ్చకాయలు, వాటి గింజల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

పుచ్చకాయలు, వాటి గింజల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

ఎండాకాలంలో మామిడి పండుతో పాటు ఎక్కువగా దొరికేది పుచ్చకాయ ఒకటి. ఎండాకాలంలో మన అందరికి ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాంటపుడు కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ తాగినా దాహం తీరదు. కానీ పుచ్చకాయను తింటే తొందరగా దాహం తీరుతుంది. పుచ్చకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది. పుచ్చకాయ మన చర్మం కాంతివంతంగా మారడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ A, C, E మరియు కాల్షియమ్ లాంటి పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ మన శరీరంలో ఉండే షుగర్, వాటర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తాయి.

అంతేకాక రక్తపోటు, గుండెపోటు వంటివి రావడాన్ని తగ్గించడానికి పుచ్చకాయ సహాయపడుతుంది. కడుపు నొప్పి, విరోచనాలు తగ్గాలంటే పుచ్చకాయను తినాలి. చర్మంపై ఉండే ముడతలను, మచ్చలను దూరం చేసి చర్మం రంగును మెరుగుపరుస్తుంది. పుచ్చకాయను తిన్న తరువాత నీరు త్రాగకూడదు. పుచ్చకాయను కడుపుతో ఉన్నవారు తింటే పుట్టే బిడ్డ ఆరోగ్యాంగా పుడతారు.

పుచ్చకాయ కాకుండా పుచ్చకాయ గింజలలో కూడా వివిధ రకాల పోషక విలువలు ఉంటాయి. పుచ్చకాయ గింజలను నేరుగా తినకూడదు. పుచ్చకాయ గింజల్ని బాగా ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి. ఇలా తయారైన పొడిని ఒక లీటరు నీటిలో రెండు చెంచాల పొడిని వేసి స్టౌ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా మరిగిన వాటిని మనం రోజు విడిచి రోజు తాగితే మన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇలా త్రాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కూడా కరిగే అవకాశం ఉంది. అందుకే ఎండాకాలంలో దొరికే పుచ్చకాయని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచి చేకూరుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి