iDreamPost

సిటీలో బెగ్గింగ్‌ మాఫియా హల్‌చల్‌.. ముసలి వాళ్లను తీసుకువచ్చి!

సిటీలో బెగ్గింగ్‌ మాఫియా హల్‌చల్‌.. ముసలి వాళ్లను తీసుకువచ్చి!

దేశంలో బెగ్గింగ్‌ మాఫియా ఆగడాలు ఎక్కువయిపోయాయి. కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, పిల్లలను, ఆడవాళ్లను బిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. వారిని రోడ్లపై అడుక్కోనిచ్చి.. ఆ డబ్బుతో బెగ్గింగ్‌ మాఫియా సభ్యులు జల్సాలు చేస్తున్నారు. పోలీసులు బెగ్గింగ్‌ మాఫియాను అరికట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎక్కడో చోట బెగ్గింగ్‌ మాఫియా వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా, హైదరాబాద్‌ నగరంలో బెగ్గింగ్‌ మాఫియా వెలుగుచూసింది.

ఓ వ్యక్తి ముసలివాళ్లను తన మాఫియాలోకి దింపి సొమ్ము చేసుకుంటూ ఉన్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు బెగ్గింగ్‌ మాఫియాను బస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన అనిల్‌ పవార్‌ అనే వ్యక్తి బెగ్గింగ్‌ మాఫియాకు తెరతీశాడు. వివిధ ప్రాంతాల నుంచి ముసలి వాళ్లను తీసుకువచ్చి.. వారితో బిక్షం ఎత్తిస్తూ ఉన్నాడు. జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్, కేబీఆర్‌ పార్క్ దగ్గర బిక్షం ఎత్తిస్తూ ఉన్నాడు. వారు రోజంతా కష్టపడి సంపాదించినది తాను తీసుకుని.. వారికి 200 రూపాయలు ఇస్తున్నాడు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు బెగ్గింగ్‌ మాఫియాను బస్ట్‌ చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్‌ పార్క్ వద్ద బిక్షం ఎత్తుకుంటున్న మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద అనిల్ పవార్ పై కేసు నమోదు చేశారు. అనంతరం అతడ్ని అరెస్ట్‌ చేశారు. బెగ్గింగ్‌ మాఫియాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరి, హైదరాబాద్‌ నగరంలో బెగ్గింగ్‌ మాఫియా వెలుగు చూడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి