iDreamPost

డ్రైవర్ అడిగాడని బైక్- క్యాబ్ రైడ్లు క్యాన్సిల్ చేస్తున్నారా? మీకే నష్టం

Disadvantages Of Canceling Bike/Cab Rides: ప్రస్తుతం అందరూ బైక్, క్యాబ్ లలో ప్రయాణాలు చేస్తున్నారు. రైడ్ బుక్ అయిన తర్వాత వచ్చిన డ్రైవర్ క్యాన్సిల్ చేయమని చెప్తాడు. అలా మీరు క్యాన్సిల్ చేస్తే ఎంత నష్టమో చూడండి.

Disadvantages Of Canceling Bike/Cab Rides: ప్రస్తుతం అందరూ బైక్, క్యాబ్ లలో ప్రయాణాలు చేస్తున్నారు. రైడ్ బుక్ అయిన తర్వాత వచ్చిన డ్రైవర్ క్యాన్సిల్ చేయమని చెప్తాడు. అలా మీరు క్యాన్సిల్ చేస్తే ఎంత నష్టమో చూడండి.

డ్రైవర్ అడిగాడని బైక్- క్యాబ్ రైడ్లు క్యాన్సిల్ చేస్తున్నారా? మీకే నష్టం

పట్టణాలు, నగరాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ అన్నీ సౌకర్యాలు చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. వాటిలో మరీ ముఖ్యంగా ప్రజా రవాణాకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. షేర్ ఆటోలు, హైర్ ఆటోలు, బైకులు, బస్సులు, క్యాబులు, మెట్రోలు, ఎంఎంటీఎస్ ఇలా ఎన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నా కూడా అన్నింటికి హై డిమాండ్ ఉంటుంది. వాటిలో మరీ ముఖ్యంగా బైక్, ఆటో, క్యాబులకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది. అయితే ఈ మధ్యకాలంలో రైడ్ లను క్యాన్సిల్ చేయడం ఎక్కువ అయిపోయింది. అలా చేస్తే మీరే నష్టపోతారు అనే విషయం మీకు తెలుసా?

మీరు హడావుడిగా ఎక్కడికో వెళ్లాలి. బస్సులు, షేర్ ఆటోలు అంటే లేట్ అవుతుంది. వెంటనే ఆన్ లైన్ లో ఆటోనో, బైకో, క్యాబో బుక్ చేసుకుంటారు. రైడ్ బుక్ అయిన తర్వాత తీరా బండి వచ్చాక.. ఆ డ్రైవర్ ఎంత చూపిస్తోంది అని అడుగుతాడు. ఇంత మొత్తం అని చెప్పగానే రైడ్ క్యాన్సిల్ చేయండి.. నేను అదే మొత్తానికి తీసుకెళ్తాను అని చెప్తారు. చాలామంది ఏముందిలే అని రైడ్ ని క్యాన్సిల్ చేస్తారు. ఇంకొంతమంది విషయం తెలియక హడావుడిలో రైడ్ ని క్యాన్సిల్ చేసుకుని వెళ్తారు. అలా చేస్తే మీకే నష్టం అనే విషయం మాత్రం మీకు తెలియదు. అలా ఎప్పుడూ ఒకసారి బుక్ చేసుకున్న రైడ్ ని క్యాన్సిల్ చేసుకోకండి. అలా చేయడం వల్ల మీరు రెండు రకాల నష్టాలకు గురవుతారు.

ఫైన్ కట్టాలి:

మీరు రైడ్ బుక్ చేసుకున్న తర్వాత సదరు డ్రైవర్ మీ లోకేషన్ కి స్టార్ట్ కాకముందే మీరు రైడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అక్కడ కారణంగా టూ మచ్ వెయిటింగ్ అని పెట్టవచ్చు. అలా రైడ్ ని క్యాన్సిల్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, రైడ్ బుక్ అయ్యాక ఆ డ్రైవర్ మీ లొకేషన్ కి వచ్చేశాక మీరు రైడ్ ని క్యాన్సిల్ చేస్తే మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఆ ఫైన్ మీకు అప్పుడు చూపించదు. అందుకే చాలామంది డ్రైవర్ అడగ్గానే రైడ్ ని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. కానీ, తర్వాతి రైడ్ బుక్ చేసుకునే సమయంలో మీకు ఎంతో కొంత మొత్తం ఫైన్ కింద పడుతుంది. ఆ మొత్తం ఒక్కోసారి రూ.50 నుంచి రూ.100 కూడా ఉండచ్చు. అందుకే మీరు డ్రైవర్ అడిగాడని వెంటనే రైడ్ ని క్యాన్సిల్ చేయకండి. అతను మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు క్యాన్సిల్ చేయకపోయినా రైడ్ కంప్లీట్ చేయాల్సిందే. ఒకవేళ తీసుకెళ్లను అంటే.. మీరు ఆ యాప్ లో ఫిర్యాదు కూడా చేయచ్చు.

ఇన్సూరెన్స్ కోల్పోతారు:

సాధారణంగా మనిషికి బీమా ఉండటం అనేది ముఖ్యం. కానీ, చాలామందికి ఇన్సూరెన్స్ అనేది ఉండదు. మీకు ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా.. మీరు సదరు రైడింగ్ యాప్స్ లో రైడ్ బుక్ చేసుకుంటే మీరు ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు రైడ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. ఆస్పత్రి ఖర్చులకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు కంపెనీ భరిస్తుంది. అంతేకాకుండా.. ప్రమాదంలో ఒకవేళ రైడర్, డ్రైవర్ ఎవరి ప్రాణానికి నష్టం కలిగినా కూడా.. రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు బీమా లభిస్తుంది. మీరు గనుక రైడ్ ని క్యాన్సిల్ చేస్తే ఈ బీమాని పొందేందుకు వీలు ఉండదు. అలాగే మీరు పదే పదే రైడ్స్ క్యాన్సిల్ చేస్తే మీ రేటింగ్ కూడా తగ్గిపోతుంది. రేటింగ్ తక్కువ ఉన్న

అంతేకాకుండా రైడ్ క్యాన్సిల్ చేసి ప్రయాణం చేసే సమయంలో సేఫ్టీ పరంగా కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. ఒకవేళ అనుకోని సంఘటన జరిగినా.. చేదు అనుభవాలు ఎదురైనా కూడా రైడ్ క్యాన్సిల్ చేశాక మీ ప్రయాణానికి కంపెనీ బాధ్యత వహించదు. అయితే ఇక్కడ రైడ్ క్యాన్సిల్ చేయమని చెప్పే డైవర్లను కూడా తప్పుబట్టలేం. ప్రస్తుతం ఆయా కంపెనీలు కమిషన్ ఎక్కువగా ఛార్చ్ చేస్తున్నాయి. పెరిగిపోయిన ఫ్యూయల్ ధరల దృష్ట్యా వాహనదారులు, డ్రైవర్లకు పెద్దగా లాభం ఉండటంలేదు. అందుకే వాళ్లు ఇలా రైడ్ ని క్యాన్సిల్ చేస్తే.. కంపెనీకి వెళ్లే కమీషన్ కూడా వారికే ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. బుకింగ్ క్యాన్సిల్ చేస్తే మీరు కట్టే ఫైన్ కూడా ఆ డ్రైవర్ కే అందుతుంది. కొంతమంది ఆ కారణం చేత కూడా కావాలని రైడ్ ని క్యాన్సిల్ చేయమని కోరుతున్నారు. ఈసారి బైక్/క్యాబ్ రైడ్ ని క్యాన్సిల్ చేసే ముందు ఈ నష్టాల గురించి ఆలోచించండి. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి