iDreamPost

Beast Movie అరబ్ దేశంలో రిలీజ్ ఆగిపోయింది

Beast Movie అరబ్ దేశంలో రిలీజ్ ఆగిపోయింది

ఈ నెల 13న విడుదల కాబోతున్న విజయ్ కొత్త సినిమా బీస్ట్ ని కువైట్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. కారణాలు బయటికి చెప్పలేదు కానీ అందులో తీవ్రవాదులుగా చూపించిన పాత్రలు పాకిస్థాన్ కు చెందిన వాళ్ళుగా చిత్రీకరించడం వల్లే సెన్సార్ అధికారులు విడుదలకు అభ్యంతరం చెప్పారట. సో బీస్ట్ అక్కడ రిలీజ్ కావట్లేదు. ఇదే కాదు గతంలో దుల్కర్ సల్మాన్ కురుప్, విష్ణు విశాల్ ఎఫ్ఐఆర్ కూడా ఇదే విధంగా కువైట్ నిషేదానికి గురయ్యాయి. వాటిలో కూడా ఇదే తరహాలో ఇస్లాం మతానికి చెందిన వ్యక్తులను సంఘటనలను నెగటివ్ గా చూపించడం వల్లే తమ దగ్గర థియేట్రికల్ రిలీజ్ కు ససేమిరా నో చెప్పేశారు. డిజిటల్ లోనూ రానివ్వలేదు.

అరబ్ దేశాల్లో సినిమాల విషయంలో ఇంత కఠినంగా ఉంటోంది కువైట్ ఒక్కటే. దుబాయ్ లో మరీ ఈ స్థాయిలో తీవ్ర నిబంధనలు లేవు. అయినా కువైట్ మార్కెట్ పోయినంత మాత్రాన పెద్ద నష్టమేమి ఉండదు కానీ అక్కడి భారతీయులు బీస్ట్ చూసే అవకాశాన్ని కోల్పోతారు. అలా అని ఆన్ లైన్ లో చూడొచ్చు కదా అనుకునేరు. ఆ ఛాన్స్ కూడా లేదు. ఓటిటిలో రావాలన్నా అక్కడి ప్రభుత్వం క్లియరెన్స్ అవసరం. సెన్సార్ నో చెప్పేశాక మళ్ళీ డిజిటల్ కు సెపరేట్ పర్మిషన్ అంటూ ఏమి ఉండదు. కెజిఎఫ్ చాప్టర్ 2కు ఈ ఇబ్బంది లేదు. ఇది గ్యాంగ్ స్టర్ డ్రామా కాబట్టి సాఫీగా విడుదల జరిగిపోతుంది. సో ఎటొచ్చి బీస్ట్ కే వచ్చింది చిక్కంతా.

ఇక్కడ ఎవరు మాత్రం చేయగలిగింది ఏమి లేదు. అక్కడి చట్టాలను అనుసరించడం తప్ప. ఇదే తరహాలో పాకిస్థాన్ లోనూ మన సినిమాలు ఎన్నో రిలీజ్ కు నోచుకోలేదు. దానికి చెప్పే కారణం ఎప్పుడూ ఒకటే. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఫార్మాట్ లో సినిమా అందరికీ చేరువవుతున్న తరుణంలో ఇలా కొన్ని దేశాలు బ్యాన్లు చేయడం విచిత్రమే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన బీస్ట్ కథ ఓ షాపింగ్ మాల్ చుట్టూ తిరుగుతుంది. తమ డిమాండ్ల కోసం కస్టమర్లను బంధించిన తీవ్రవాదులను ఎదురుకుని అక్కడే ఉన్న రా ఆఫీసర్ ఎలా కాపాడాడు అనే పాయింట్ మీద తీశారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఆల్రెడీ ఛార్ట్ బస్టర్ అయ్యింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి