iDreamPost

కోహ్లీ సెంచరీపై బంగ్లాదేశ్‌ ఏడుపు! అంపైర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌

  • Published Oct 20, 2023 | 5:57 PMUpdated Oct 20, 2023 | 5:57 PM

బంగ్లాదేశ్‌పై విరాట్‌ కోహ్లీ సెంచరీ చేసినందుకు ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా సంతోషంగా ఉంటే.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ అభిమానులు ఏడుపు పెడబొబ్బులు పెడుతున్నారు. పైగా అంపైర్‌పై విమర్శలకు దిగుతున్నారు. వారి ఏడుపుకు కారణం ఏంటో మాత్రం అర్థం కావడం లేదు.

బంగ్లాదేశ్‌పై విరాట్‌ కోహ్లీ సెంచరీ చేసినందుకు ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా సంతోషంగా ఉంటే.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ అభిమానులు ఏడుపు పెడబొబ్బులు పెడుతున్నారు. పైగా అంపైర్‌పై విమర్శలకు దిగుతున్నారు. వారి ఏడుపుకు కారణం ఏంటో మాత్రం అర్థం కావడం లేదు.

  • Published Oct 20, 2023 | 5:57 PMUpdated Oct 20, 2023 | 5:57 PM
కోహ్లీ సెంచరీపై బంగ్లాదేశ్‌ ఏడుపు! అంపైర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌

వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీ హైలెట్‌గా నిలిచింది. చివర్లో మ్యాచ్‌ విజయానికి మరో 26, 30 పరుగులు అవసరమైన సమయంలో.. యాదృశ్చికంగా కోహ్లీ సెంచరీకి కూడా దాదాపు అన్నే పరుగులు అవసరం అయ్యాయి. కోహ్లీ పార్ట్నర్‌ కేఎల్‌ రాహుల్‌ మంచి సహకారం అందించడంతో కోహ్లీ తన సెంచరీని పూర్తి చేసుకోగలిగాడు. అయితే.. చివర్లో టీమిండియా విజయానికి 2 పరుగులు అవసరమైన సమయంలో.. కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడానికి 3 రన్స్‌ కావాలి.

ఈ టైమ్‌లో బంగ్లాదేశ్‌ బౌలర్‌ నసూమ్‌ అహ్మద్‌ 42వ ఓవర్‌ తొలి బంతిని లెగ్‌ స్టంప్‌ వైపు వేశాడు. అది కోహ్లీ పక్కగా వెళ్లి కీపర్‌ చేతుల్లో పడింది. అంతా దాన్ని వైడ్‌ అనుకున్నారు. కోహ్లీ సెంచరీని అడ్డుకోవడానికి బంగ్లా బౌలర్‌ కావాలనే వైడ్‌ వేస్తున్నాడని అంతా కోపంతో ఊగిపోయారు. కోహ్లీ సైతం ఏంటి బ్రో? అన్నట్లు బౌలర్‌ వంక చూశాడు. అయితే.. అంపైర్‌ దాన్ని వైడ్‌ ఇవ్వకపోవడం గమనార్హం. బాల్ పడిన తర్వాత.. కోహ్లీ లోపలికి జరిగాడని అంపైర్‌ దాన్ని లీగల్‌ డెలవరీగా గుర్తించాడు. అయితే.. రెండు బంతికి రన్‌ రాలేదు. మూడో బంతిని కూడా బౌలర్‌ వైడ్‌ వేయడానికి ప్రయత్నించగా.. ముందుగానే పసిగట్టిన కింగ్‌ కోహ్లీ.. ముందుకొచ్చి మరీ సిక్స్‌ కొట్టి.. మ్యాచ్‌ గెలిపించడంతో పాటు తన సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.

అయితే.. 42వ ఓవర్‌ తొలి బంతిని వైడ్‌ ఇవ్వకపోవడంపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్‌ కావాలనే వైడ్‌ ఇవ్వలేదని, అయినా.. ఒక బౌలర్‌ ఉద్దేశపూర్వంగా వైడ్‌ వేస్తున్నాడని అంపైర్‌ ఎలా నిర్దారిస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే.. అంపైర్‌కు క్రికెట్‌ రూల్స్‌ కంటే కూడా కోహ్లీ సెంచరీనే ముఖ్యమా? అంటూ పేర్కొంటున్నారు. అయితే.. కోహ్లీ సెంచరీ పూర్తి కాకుండా చేయాలనే ఉద్దేశంతోనే నసూమ్‌ వైడ్స్‌ వేస్తున్నట్లు క్లియర్‌గా అందరకీ అర్థమైపోయింది. అయినా కూడా బంగ్లాదేశ్‌ ఫ్యాన్స్‌కి కానీ, క్రికెటర్లకు కానీ.. కోహ్లీ సెంచరీపై ఇంత ఏడుపు ఎందుకని భారత క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌ ఓడినా.. ఈ బౌలర్‌ గట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి