iDreamPost

చిరు, బాలయ్యతో ఒకే ఫ్రేమ్ లో మెరిసిన కుర్రాడిని గుర్తుపట్టారా?

Mokshagna Childhood Photo: సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మెగస్టార్ చిరంజీవి, బాలకృష్ణను సింగిల్ ఫ్రేమలోకి తీసుకొచ్చిన ఓ యువకుడి ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి.. ఆ బుడ్డొడు ఎవరంటే..

Mokshagna Childhood Photo: సెలబ్రిటీలకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మెగస్టార్ చిరంజీవి, బాలకృష్ణను సింగిల్ ఫ్రేమలోకి తీసుకొచ్చిన ఓ యువకుడి ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి.. ఆ బుడ్డొడు ఎవరంటే..

చిరు, బాలయ్యతో ఒకే ఫ్రేమ్ లో మెరిసిన కుర్రాడిని గుర్తుపట్టారా?

ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి పిల్లలకు చెందిన త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో, హీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫిక్స్, అలానే మరికొన్ని ఓల్డ్ ఫిక్స్ నెటింట్లో తెగ  హల్ చల్ చేస్తుంటాయి.  అలానే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారి ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. అలానే తాజాగా టాలీవుడ్ కు చెందిన కుర్రాడి ఫోటో నెట్టింట్లో కనిపిస్తుంది. నందరమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తో కలిసి సింగిల్ ఫ్రేమ్ లో కనిపిస్తున్నఈ బాలుడిని మీరు గుర్తుపట్టారా?. ఆ కుర్రాడి కుటుంబానికి టాలీవుడ్ లో పెద్ద బ్యాగ్రౌండే ఉంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగస్టార్  చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు టాప్ హీరోలు. 80,90 దశకంలో టాలీవుడ్ లో ఓ రేంజ్ దూసుకెళ్లారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలుగా తమ సత్తాచూపిస్తున్న సంగతి తెలిసిందే. కుర్రాళ్ళాకు పోటీగా వీరు బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందిస్తున్నారు. వీరిద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకు వీరి క్రేజ్ మరింతగా పెరుగుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ ఇద్దరిలో ఏ ఒక్కరితో ఫోటో దిగిన చాలా అదృష్టమని భావించే అభిమానులు ఎంతో మంది ఎంతోమంది ఉన్నారు. అలాంటిది ఏకంగా ఇద్దరు లెజెండ్రి నటులతో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చాడు ఈ బుడ్డోడు. ఈ ఇద్దరి లెజండ్స్ కి సంబంధించిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మెగస్టార్, బాలయ్య లాంటి ఇద్దరు స్టార్ హీరోస్ ని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకువచ్చి ఫోటో స్టిల్ ఇచ్చిన ఈ కుర్రాడు ఎవరా అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరో, ఆవివరాలు చూద్దాం.. మెగస్టార్ చిరు, బాలయ్య తో సింగిల్ ఫ్రేమ్ లో ఉన్న వ్యక్తి ఎవరో కాదు.. నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ. గతంలో ఓ సందర్భంలో వీరిద్దరితో మోక్షజ్ఞ ఫోటో దిగాడు. అదే ప్రస్తుతం ఆ ఫిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది ఇలా ఉంటే.. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  రోజులు గడుస్తున్న వారి కోరిక మాత్రం నెరవేరలేదు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఈ ఏడదిలోనే ఉంటుంది అంటూ గతంలో చెప్పిన బాలయ్య.. మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మోక్షజ్ఞ చిన్ననాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి