iDreamPost

పద్మశ్రీ కొండప్పకు బలగం చిత్ర యూనిట్ సత్కారం.. దిల్ రాజు ఆర్థిక సాయం

గత ఏడాది విడుదలైన బలగం చిత్రం ఎంతటి సెన్సేషనల్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. కుటుంబ బంధాల గురించి తనదైన శైలిలో తీసి మెప్పించాడు వేణు. ఈ సినిమా కలెక్షన్లు కొల్లగొట్టడమే కాదూ.. అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇందులో పాట పాడిన

గత ఏడాది విడుదలైన బలగం చిత్రం ఎంతటి సెన్సేషనల్ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. కుటుంబ బంధాల గురించి తనదైన శైలిలో తీసి మెప్పించాడు వేణు. ఈ సినిమా కలెక్షన్లు కొల్లగొట్టడమే కాదూ.. అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇందులో పాట పాడిన

పద్మశ్రీ కొండప్పకు బలగం చిత్ర యూనిట్ సత్కారం.. దిల్ రాజు ఆర్థిక సాయం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుండి ఎనిమిది మందికి ఈ అవార్డులు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది మోడీ సర్కార్. ఇక తెలంగాణ నుండి ఐదుగురు పద్మశ్రీకి ఎంపికయ్యారు. వారిలో ఒకరు బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప. నారాయణ పేట జిల్లా దామరగిడ్డకు చెందిన ఆయన రామాయణ, మహాభాతరంలోని పాటలను, పలు పౌరాణిక గాధలను వీణ వాయిస్తూ చెబుతుంటారు. ఎన్నో ఏళ్ల నుండి ఆయన బుర్రవీణ కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారు. బుర్రవీణ వాయిస్తూ కథలు చెప్పే వారిలో ప్రస్తుతం కొండప్ప ఒక్కరే ఉన్నారు.

కాగా, గత ఏడాది విడుదలైన బలగం సినిమాలో ‘అయ్యే శివుడా ఏమాయే’ అనే పాట పాడటంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన మహాబూబ్ నగర్‌లోని ఓ కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు బుర్రవీణపై శిక్షణ ఇస్తున్నారు. వాటి ద్వారా వచ్చే డబ్బులతోనే ఆయన జీవిస్తున్నారు. ఈ క్రమంలో కళా రంగంలో ఆయన చేస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. పద్మశ్రీతో సత్కరించింది. కాగా, ఇటీవల ఆయన్ను మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ కార్యక్రమాన్ని నిర్వహించి సత్కరించిన సంగతి విదితమే. కాగా, తాజాగా బలగం చిత్ర యూనిట్ ఆయనకు సత్కారం చేసింది. బలగం మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన కుమార్తె హన్షిత, అల్లుడు హర్షిత్ రెడ్డి నిర్మించారు.

కొండప్పను సత్కరించడంతో పాటు లక్ష రూపాయాలు ఆర్థిక సాయం అందించారు దిల్ రాజు. ఆయన కుమార్తె హన్షిత రెడ్డితో సహా పలువురు కొండప్పకు వెంకటేశ్వర స్వామి ఫోటోను అందించారు. ఇక ఈ మూవీ డైరెక్టర్ వేణు ఎల్దండి ఆయనకు శాలువా కప్పారు. అనంతరం దిల్ రాజు.. లక్ష రూపాయలు అందిస్తూ.. మీరు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయనకు దేనికైనా ఉపయోగించండని కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా, కుటుంబ బంధాలు, బాంధవ్యాలతో గుండెల్ని పిండేసే విధంగా బలగం మూవీని తెరకెక్కించాడు వేణు. తొలి సినిమాతో ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ అనేక అవార్డులను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి