iDreamPost

ఈసారి నా ప్రమాణస్వీకారం విశాఖ నుంచే: CM జగన్

CM Jagan- Vizag City: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన పరిపాలన వైజాగ్ నుంచే ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం తర్వాత విశాఖపట్నం నుంచే తాను ప్రమాణస్వీకారం చేస్తానంటూ మరోసారి స్పష్టం చేశారు.

CM Jagan- Vizag City: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన పరిపాలన వైజాగ్ నుంచే ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం తర్వాత విశాఖపట్నం నుంచే తాను ప్రమాణస్వీకారం చేస్తానంటూ మరోసారి స్పష్టం చేశారు.

ఈసారి నా ప్రమాణస్వీకారం విశాఖ నుంచే: CM జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి కొనసాగుతోంది. వరుణుడు వాతావరణాన్ని చల్లబరిచినా ఎన్నికల వేడి మాత్రం అలాగే ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారాన్ని చేపడతాం అంటూ అధికార వైసీపీ, సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే గెలిచిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేయాలి అని ప్రణాళికలు రచిస్తున్నారు? అసలు ఏం చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపేందుకు, యువతకు వైట్ కాలర్ ఉద్యోగాలు తెచ్చి పెట్టేందుకు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాలను స్వయంగా ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా అధికారి వైఎస్సార్సీపీ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని, అందించిన సంక్షేమాన్ని, రాష్ట్ర ప్రజల కుటుంబాల్లో నింపిన సంతోషాల గురించి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన ప్రతి ఒక్కరు తన స్టార్ క్యాంపైనర్లు అంటూ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసారి గెలిచిన తర్వాత తన ప్రమాణస్వీకారం మాత్రం విశాఖపట్నం నుంచే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన ప్రమాణస్వీకారం మాత్రం వైజాగ్ సిటీ నుంచే ఉంటుందని స్పష్టం చేశారు.

అలా ఎందుకు చేయబోతున్నారో కూడా స్పష్టం చేశారు. వైజాగ్ నుంచి ప్రభుత్వ పరిపాలన జరిగితే.. అక్కడ ఎక్కవ అభివృద్ధి జరగుతుందని వెల్లడించారు. ఈ ఐదేళ్ల పాలనలో విద్య, వైద్యం, రైతాంగం, ప్రజా సంక్షేమం, మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాలను బలోపేతం చేశామన్నారు. అవి మాత్రమే కాకుండా పోర్టులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లు శరవేగంగా జరుగుతున్నాయి. నెక్ట్స్ టార్గెట్ వైట్ కాలర్ జాబ్స్.. అంటే ఐటీ జాబ్స్ తమ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు.. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్ డేటా సెంటర్ లాంటివి తమ కార్యాలయాలను స్టార్ట్ చేసిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆయా సంస్థలు వర్క్ కూడా స్టార్ట్ చేశాయి. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి రాజధాని నుంచి తన పరిపాలన ప్రారంభిస్తాడో.. అప్పుడు ఈ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే ఈసారి ఆయన ప్రమాణస్వీకారం విశాఖ నగరం నుంచే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి