iDreamPost

రచిన్ రవీంద్ర అరుదైన ఘనత.. ఏకంగా సచిన్‌ రికార్డు సమం!

  • Author singhj Published - 09:44 PM, Sat - 28 October 23

న్యూజిలాండ్ యంగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో సెంచరీ బాదిన రచిన్.. ఏకంగా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.

న్యూజిలాండ్ యంగ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో సెంచరీ బాదిన రచిన్.. ఏకంగా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.

  • Author singhj Published - 09:44 PM, Sat - 28 October 23
రచిన్ రవీంద్ర అరుదైన ఘనత.. ఏకంగా సచిన్‌ రికార్డు సమం!

రచిన్ రవీంద్ర.. వన్డే వరల్డ్ కప్-2023లో బాగా మార్మోగుతున్న పేర్లలో ఒకటి. 23 ఏళ్ల ఈ డాషింగ్ లెఫ్టాండర్ తన బ్యాట్​తో చేస్తున్న మ్యాజిక్ అంతా ఇంతా కాదు. వరుసగా విధ్వంసకర ఇన్నింగ్స్​లు ఆడుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు రచిన్. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్​తో మ్యాచ్​లో 96 బంతుల్లో 123 రన్స్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడీ యంగ్ ఆల్​రౌండర్. ఆ తర్వాత నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్​తో మ్యాచ్​లోనూ 87 బంతుల్లో 75 రన్స్ చేసి తన సత్తాను మరోమారు ప్రూవ్ చేశాడు రచిన్.

ధర్మశాల వేదికగా ఇవాళ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో మరోమారు తన బ్యాట్ పవర్ చూపించాడు రచిన్ రవీంద్ర. ఈ మ్యాచ్​లో 89 బంతుల్లో ఏకంగా 116 రన్స్ చేశాడు. రచిన్ ఇన్నింగ్స్​లో 9 ఫోర్లతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ రేంజ్​లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లపై పూర్తిగా అతడి డామినేషన్ సాగింది. డారిల్ మిచెల్ (54)తో కలసి కివీస్​ ఛేజింగ్​లో కీలక పాత్ర పోషించాడు రచిన్. అయితే అతడు ఔటవ్వడంతో ఛేదనలో న్యూజిలాండ్ వెనుక పడింది. ఈ సెంచరీ ద్వారా రచిన్ అరుదైన ఘనత సాధించాడు. 23 ఏళ్ల వయసులో వరల్డ్ కప్​లో 2 సెంచరీలు బాదిన టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ సరసన అతడు చోటు సంపాదించాడు.

ఒకవేళ మెగాటోర్నీలో మరో సెంచరీ కొడితే లిటిల్ మాస్టర్ రికార్డును రచిన్ బ్రేక్ చేసినట్లవుతుంది. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత ఆసీస్ బ్యాటింగ్​కు దిగి ఏకంగా 388 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ టీమ్​లో డేవిడ్ వార్నర్ (81), ట్రావిస్ హెడ్ (109) అద్భుతంగా రాణించారు. వీళ్లిద్దరూ కలసి ఫస్ట్ వికెట్​కు ఏకంగా 175 రన్స్ జోడించారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ (36), మ్యాక్స్​వెల్ (41), ఇంగ్లిస్ (38) విలువైన పరుగులు చేశారు. ఆఖర్లో ప్యాట్ కమిన్స్ (37) బ్యాట్ ఝళిపించడంతో కంగారూ టీమ్​ దాదాపుగా నాలుగొందల స్కోరుకు దగ్గరగా వచ్చి ఆగింది. ఛేజింగ్​కు దిగిన కివీస్ ప్రస్తుత స్కోరు 49 ఓవర్లకు 370. జేమ్స్ నీషమ్ (51 నాటౌట్), ట్రెంట్ బౌల్ట్ (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. రచిన్ బ్యాటింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: పాక్‌ ఓటమిపై భజ్జీ అసహనం! తప్పుడు నిర్ణయాలంటూ మండిపాటు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి