iDreamPost

ప్రేమ పేరుతో వంచన.. విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్ కేసు పూర్తి వివరాలు!

విశాఖ పట్నంలో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రేమిస్తున్నానని చెప్పి ఓ యువకుడు బాలికను మోసం చేసి దారుణానికి ఒడిగట్టాడు. అసలు ఏం జరిగిందంటే?

విశాఖ పట్నంలో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రేమిస్తున్నానని చెప్పి ఓ యువకుడు బాలికను మోసం చేసి దారుణానికి ఒడిగట్టాడు. అసలు ఏం జరిగిందంటే?

ప్రేమ పేరుతో వంచన.. విశాఖలో బాలికపై గ్యాంగ్ రేప్ కేసు పూర్తి వివరాలు!

దేశంలో మహిళలు, యువతుల పట్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకు వచ్చి అమలు చేస్తున్నప్పటికీ దారుణాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ప్రతిరోజు ఏదో ఓ చోట ఆకతాయిలు దారుణాలకు పాల్పడుతున్నారు. స్నేహం ముసుగులో, ప్రేమ పేరుతో వంచించి ఘోరాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో విశాఖ పట్నంలో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. ఒడిషాకు చెందిన ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రేమిస్తున్నానని చెప్పి ఓ యువకుడు స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. అవమానం భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్ కు వెళ్లిన బాలికపై మరోసారి అత్యాచారం జరిగింది.

విశాఖలో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మైనర్‌ బాలికపై అత్యాచారం ఘటనలో 13మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖలో బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రధాన నిందితుడు ఇమ్రాన్‌, అతని స్నేహితుడు షోయబ్‌లు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. బాలికను అపహరించిన ఆర్కే బీచ్‌లో ఫోటో గ్రాఫర్లుగా పనిచేస్తున్న 11మందిని అరెస్ట్‌ చేశారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం వారికి 14రోజుల రిమాండ్ విధించింది.

అసలు ఏం జరిగిందంటే?

ఒడిశాకు చెందిన ఓ కుటుంబం ఉపాధి కోసం విశాఖకు వచ్చారు. అక్కడే ఓ అపార్ట్ మెంట్ లో వాచ్‌మాన్‌గా పనిచేస్తూ కంచరపాలెంలో నివసిస్తున్నారు. అతని 17ఏళ్ల కుమార్తె పోర్టు క్వార్టర్స్‌ సమీపంలోని నేవీ అధికారి ఇంట్లో పని చేస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 17న పని కోసం వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 18వ తేదీన విశాఖ ఫోర్‌టౌన్‌ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ బాలికను ఒడిషాలోని స్వగ్రామంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించి డిసెంబర్‌ 22న ఆమెను అక్కడి నుంచి విశాఖ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత బాలిక జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ కు చేరుకుని జరిగిన దారుణాన్ని వివరించి ఫిర్యాదు చేశారు.

ప్రేమ పేరుతో మోసం

నగరంలో పనిచేసుకుంటున్న ఆ బాలికకు స్థానికంగా ఉండే ఒడిషాకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడి కపట ప్రేమ బయటపడింది. డిసెంబర్‌ 18న బాలికను ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితుడికి ఫోన్ చేసి రప్పించాడు. అతడు కూడా ఆ బాలికపై అత్యాచారం చేశాడు. వారి చెర నుంచి తప్పించుకన్న బాలిక అవమాన భారంతో ఆత్మహత్య చేసుకునేందుకు విశాఖ ఆర్కే బీచ్ కు చేరుకుంది. బీచ్ లో ఏడుస్తున్న ఆ బాలికను పర్యాటకుల ఫొటోలు తీసే ఫోటోగ్రాఫర్ గమనించాడు. ఆమెతో పరిచయం చేసుకుని ఓదారుస్తున్నట్లు నమ్మించాడు.

బాలిక కూడా ఆ ఫొటోగ్రఫర్ మాటలు నమ్మడంతో ఇదే అదునుగా భావించి అక్కడి నుంచి లాడ్జ్ కు తీసుకెళ్లి అతనితో పాటు మరికొంత మంది రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక ఒడిషాకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆ బాలిక తల్లిదండ్రులు డిసెంబర్ 18న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఫస్ట్ మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఆ తర్వాత బాలిక జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రలకు తెలపడంతో వారు మళ్లీ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టి 11 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి