iDreamPost

Bigg Boss 5 : సెకండాఫ్ షో అయినా రక్తి కట్టాలి

Bigg Boss 5 : సెకండాఫ్ షో అయినా రక్తి కట్టాలి

ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ బిగ్ బాస్ 5 సీజన్ ఆశించిన ఫలితాలు రాబట్టుకోవడం లేదు. పార్టిసిపెంట్స్ సెలక్షన్ దశ నుంచే దీని మీద కామెంట్లు గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలోలా సోషల్ మీడియాను ప్రభావితం చేయగలిగే సెలబ్రిటీలు పెద్దగా లేకపోవడం ప్రభావం చూపిస్తోంది. యాంకర్ రవి, ప్రియా లాంటి ఒకరిద్దరు ఉన్నా ఆ బరువును వాళ్ళు మోయలేకపోతున్నారు. దానికి తోడు ఎలిమినేషన్లలో ఇప్పటిదాకా ఎక్కువగా లేడీస్ నే బయటికి పంపడం ఫ్యామిలీ ఫాలోయర్స్ కి నచ్చలేదనే ఫీడ్ బ్యాక్ ఉంది. ఈ రోజు వెళ్లిపోనున్న లోబోని ఇన్నేసి వారాలు ఎందుకు కొనసాగించారనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది కానీ సమాధానం లేదు.

ఈ రియాలిటీ షో మొదలైనప్పటి నుంచి ప్రతి వారం బయట ఏదో ఒక మేజర్ ఇష్యూ ఉండటం టిఆర్పి మీద ప్రభావం చూపించింది. ముందు ఐపిఎల్ తర్వాత ఇప్పుడు ఐసిసి టి20 వరల్డ్ కప్, పునీత్ రాజ్ కుమార్ లాంటి ప్రముఖుల మరణాల పట్ల ఉన్న సానుభూతి ఇలాంటి రకరకాల కారణాలు రోజూ బిగ్ బాస్ 5 చూడాలన్న ఆసక్తికి స్పీడ్ బ్రేకర్ లా మారాయి. దానికి తోడు ఎవరు మీలో కోటీశ్వరుడు దీని కన్నా కాస్త మెరుగ్గా ఉండటం చిక్కు తెచ్చి పెట్టింది, అర్థం లేని డ్రామా కన్నా జ్ఞానం ఇచ్చే క్విజ్ లు మేలనుకుంటున్న ఆడియన్స్ లేకపోలేదు వీక్ డేస్ లో ప్రోగ్రాంని పదికి పెట్టడం కూడా మైనస్సే. ఇన్ని ప్రతికూలతలు వచ్చాయి మరి.

ఇప్పటికే సగం షో దాటేసింది. మిగిలిన ఎపిసోడ్ల నుంచి అద్భుతాలు ఆశించలేం కానీ నిర్వాహకులు ఇంకొంచెం గట్టిగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. రామ్ చరణ్, నితిన్, తమన్నా గెస్టులుగా వచ్చినా లాభం కలగలేదు. అఖిల్ వచ్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రమోషన్ చేసుకున్నాడు. ఈ రోజు మంచి రోజులు వచ్చాయి టీమ్ నుంచి సంతోష్ శోభన్ మెహ్రీన్ లు వచ్చి హడావిడి చేస్తున్నారు. ఇవి ఎన్ని చేసినా అసలైన ఈవెంట్ లో కిక్కిచ్చే రౌండ్లు ఉండాలి. సభ్యుల మధ్య ఆసక్తి రేపే సంఘర్షణ జరగాలి. అవేవి లేకుండా పైపై మెరుగులుతో షో రన్ చేయడం కష్టం. చూద్దాం సెకండ్ హాఫ్ అయినా బెటర్ గా ఉంటుందేమో

Also Read : 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి