iDreamPost

ఆసియా గేమ్స్‌: చైనా కుటిల బుద్ది.. గోల్డ్‌ మిస్‌ అయిన ఆంధ్రా అమ్మాయి

  • Published Oct 02, 2023 | 12:37 PMUpdated Oct 02, 2023 | 12:37 PM
  • Published Oct 02, 2023 | 12:37 PMUpdated Oct 02, 2023 | 12:37 PM
ఆసియా గేమ్స్‌: చైనా కుటిల బుద్ది.. గోల్డ్‌ మిస్‌ అయిన ఆంధ్రా అమ్మాయి

ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో భారత్‌.. అనేక క్రీడాంశాల్లో పతకాలు సాధిస్తూ.. రేసులో దూసుకుపోతుంది. ఇక చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన జ్యోతి యర్రాజీ, 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం సాధించింది. అయితే పతకం ప్రకటించడం కన్నా ముందు అక్కడ చోటు చేసుకున్న డ్రామా అంతా ఇంతా కాదు. పతకం సంగతి పక్కకు పెడితే.. ఏకంగా జ్యోతిని డిస్‌క్వాలిఫై చేశారు నిర్వాహాకులు. అయితే చైనా వల్లే జ్యోతిని డిస్‌క్వాలిఫై చేశారంటూ.. డ్రాగన్‌ కుటిల బుద్ధి మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. వెనక్కి తగ్గారు. చివరకు గోల్డ్‌ గెలవాల్సిన తెలుగమ్మాయి జ్యోతి.. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఇంతకు అక్కడ ఏం జరిగింది.. జ్యోతి గోల్డ్‌ మెడల్‌ ఎలా మిస్‌ అయ్యింది అంటే..

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేస్ స్టార్ట్ అవబోతోంది. పతక ఫేవరెట్లలో తెలుగుమ్మాయి జ్యోతి కూడా ఉన్నారు. అయితే గన్ పేలకముందే చైనాకు చెందిన అథ్లెట్‌ యన్నీ వూ పరిగెత్తడం మొదలుపెట్టింది. దీన్నే ఫాల్స్ స్టార్ట్ అంటారు. ఆమెను చూసి.. జ్యోతితో పాటు మిగతా అథ్లెట్లు కూడా పరుగు మొదలుపెట్టారు. దాంతో అక్కడ కాసేపు వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రేస్‌ పూర్తయిన తర్వాత.. అధికారులు ఆ ఫుటేజ్‌ని అనేక సార్లు పరిశీలించారు. ఈ క్రమంలో ఫాల్స్ స్టార్ట్ చేసినందుకు ఆ చైనా అథ్లెట్‌తో పాటు తెలుగుమ్మాయి జ్యోతికి కూడా రెడ్ కార్డ్ చూపించారు. అంటే రేస్‌ నుంచి డిస్‌క్వాలిఫై చేశారు. అయితే అధికారుల నిర్ణయంపై జ్యోతి అభ్యంతరం తెలిపింది. చైనా అథ్లెట్ ఫాల్స్ స్టార్ట్ చేస్తే తానెందుకు శిక్ష ఎదుర్కోవాలని ప్రశ్నించింది.

రూల్స్‌ ఏం చేబుతున్నాయి..

ఇక రూల్స్ ప్రకారం ఎవరైతే ముందు ఫాల్స్ స్టార్ట్ చేస్తారో వారొక్కరే డిస్ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మిగతా అథ్లెట్లు కూడా ఆ ఒక్కర్నే చూసి ముందుకు వెళ్తారు కాబట్టి. జ్యోతి అభ్యంతరం తెలిపిన తర్వాత అనేకసార్లు రిప్లేలు చూసిన అధికారులు, జ్యోతితో పాటు చైనా అథ్లెట్‌ యన్నీ వూకి కూడా రేసులో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. కానీ రేస్ తర్వాత వారి డిస్ క్వాలిఫికేషన్ గురించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

రేస్‌ పూర్తయిన తర్వాత చైనా అథ్లెట్ యాన్నివు రెండో స్థానంలో, మన జ్యోతి మూడో స్థానంలో నిలిచారు. కానీ మరోసారి రీప్లేలు చూసిన అధికారులు చైనా అథ్లెట్ యన్నీ వూను మాత్రమే డిస్ క్వాలిఫై చేశారు. దాంతో మూడో స్థానంలో ఉన్న జ్యోతి, రెండో స్థానానికి చేరి రజత పతకం గెలిచింది. రేస్ ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న ఈ సంఘటన వల్ల జ్యోతి డిస్టర్బ్‌ అయ్యిందని.. లేకపోతే ఇంకా బాగా పరిగెత్తేదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అంజు బాబీ జార్జ్ అన్నారు. అలా చైనా కుట్టిల బుద్ది వల్ల బంగారు పతకం సాధించాల్సిన తెలుగమ్మాయి.. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అంటున్నారు నెటిజనులు. ఏది ఏమైనా పతకం గెలిచిన జ్యోతికి అభినందనలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి