iDreamPost

రిటైర్మెంట్ చేయబోతున్న ఆ ఇద్దరు క్రికెటర్లు..

రిటైర్మెంట్ చేయబోతున్న ఆ ఇద్దరు క్రికెటర్లు..

అంతర్జాతీయ క్రికెట్ లో యువ భారతజట్టు గత రెండేళ్ళ నుంచి సంచలనాలు నమోదు చేస్తోంది. ఐసిసి ట్రోఫీల విషయంలో ఇబ్బందిపడినా కీలక సీరీస్ లు మాత్రం గెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా టూర్ కాస్త నిరాశపరిచింది గాని స్వదేశంలో జరిగిన సీరీస్ లను సీనియర్లు లేకుండానే గెలుస్తోంది. అయితే ఇప్పుడు టీం ఇండియా నుంచి ఒక్కో సీనియర్ ఆటగాడు రిటైర్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు జట్టుకి వెన్నముకలా నిలిచిన ఆటగాళ్ళు కొందరు ద్రావిడ్ సూచనలతో రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

కెఎల్ రాహుల్ ను, రిషబ్ పంత్ ను సారథ్య బాధ్యతల వైపు నడిపిస్తున్న ద్రావిడ్… ఇప్పుడు జట్టు ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తరుచూ గాయాలతో బాధపడుతున్న రవీంద్ర జడేజా, ఫాం లేక తంటాలు పడుతున్న అజింక్యా రహానే రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. జడేజా మంచి ఫాంలో ఉన్నా సరే టెస్ట్ జట్టులో సుస్థిరస్థానం ఉన్నా కూడా అతను సుదీర్ఘ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి.

దీనికి సంబంధించి ఇప్పటికే కోచ్ ద్రావిడ్ తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా ఐపిఎల్ తర్వాత అతను గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయనే మాట వినపడుతోంది. ఆల్ రౌండర్ గా అతను అన్ని ఫార్మాట్స్ లో కీలకంగా ఉన్నాడు. యువ ఆటగాళ్ళు వచ్చినా సరే బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ లో అతని స్థాయిని అందుకోవడం కష్టంగా మారింది. జడేజాకు హార్దిక్ పాండ్యా నుంచి గట్టి పోటీ ఉంటుందనే ప్రచారం జరిగినా సరే అతను జడేజా స్థాయిని అందుకోలేదు.

ఏ పిచ్ అయినా సరే జడేజా బ్యాటింగ్, బౌలింగ్ లో కీలకంగా ఉన్నాడు. ఇక రహానే విషయానికి వస్తే గత రెండేళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాడు. యువ ఆటగాళ్ళు ఆడుతున్నా సరే మిడిల్ ఆర్డర్ లో జట్టుకి అండగా నిలవడం లేదు. చెత్త బంతులకు కూడా వికెట్ ఇచ్చేస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మీద ఫోకస్ పెట్టి ఆకట్టుకుంటున్నాడు ఇప్పుడు. ఇక ఐపిఎల్ లో కూడా రహానే ఆటతీరు అంతగొప్పగా ఏమీ లేదు. అయితే జట్టుకి విలువైన సలహాలు ఇవ్వడంతోనే అతన్ని జట్టులో కొనసాగిస్తున్నారు.

ఒత్తిడి సమయంలో కెప్టెన్ కు అండగా నిలవడమే కాకుండా ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే యువ ఆటగాళ్ళ నుంచి ఒత్తిడి ఉండటంతో ద్రావిడ్ సూచనల మేరకు అతను తప్పుకునే అవకాశం ఉంది. ఐపిఎల్ తర్వాత రిటైర్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరో సీనియర్ ఆటగాడు పుజారా కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. బ్యాటింగ్ లో అప్పుడప్పుడు అండగా నిలుస్తున్నా సరే స్ట్రైక్ రేట్ ఘోరంగా ఉండటం అతనికి ప్రధాన సమస్యగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి