iDreamPost

అనన్య సూపర్ హిట్ వెబ్ సిరీస్ కు సిక్వెల్

  • Published Apr 10, 2024 | 3:32 PMUpdated Apr 10, 2024 | 3:32 PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కేవలం సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ చేయడమే కాకుండా.. ఇంట్రెస్టింగ్ సిరీస్ లను కంటిన్యూ కూడా చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆహ ప్లాట్ ఫార్మ్ ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్ కు రెండవ సీజన్ ను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కేవలం సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ చేయడమే కాకుండా.. ఇంట్రెస్టింగ్ సిరీస్ లను కంటిన్యూ కూడా చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆహ ప్లాట్ ఫార్మ్ ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్ కు రెండవ సీజన్ ను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 10, 2024 | 3:32 PMUpdated Apr 10, 2024 | 3:32 PM
అనన్య సూపర్ హిట్ వెబ్ సిరీస్ కు సిక్వెల్

ఆహా ప్లాట్ ఫార్మ్ ఇప్పటివరకు ఎన్నో సిరీస్ లను, సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు, సిరీస్ లకు పెట్టింది పేరు ఆహా ప్లాట్ ఫార్మ్. ఈ క్రమంలో ఆహలో గత ఏడాది సూపర్ సక్సెస్ సాధించిన వెబ్ సిరీస్ అర్ధమయ్యిందా అరుణ్ కుమార్. ఈ సిరీస్ కు ఓటీటీలో విపరీతమైన బజ్ రావడంతో.. ఇప్పుడు దీనికి రెండవ సీజన్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్నీ స్వయంగా ఆహా ఓటీటీ ఏ అనౌన్స్ చేయడం విశేషం. మొదటి సీజన్ కు లభించిన విశేష ఆదరణ కారణంగానే ఇప్పుడు ఈ సిరీస్ కు కంటిన్యుషన్ గా రెండవ సీజన్ ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి ఈ సీజన్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతోంది. అసలు మొదటి సీజన్ కు అంత క్రేజ్ ఎలా వచ్చింది. ఆ స్టోరీ ఏంటి అనే వివరాలను చూసేద్దాం.

ఉగాది సందర్బంగా ఆహ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 అనౌన్స్‌మెంట్ ను.. “ఆఫీస్ కు వెళ్లి ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ ఇష్టపడతారు. సీజన్ 2 లోడింగ్” అనే క్యాప్షన్ తో తెలియజేసింది. ఎందుకంటే ఈ సిరీస్ కథ మొత్తం.. ఓ కార్పొరేట్ ఉద్యోగి కష్టాల చుట్టూ తిరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆహా ప్లాట్ ఫార్మ్ ఎట్లిచ్చినం అనే హ్యాష్‌ట్యాగ్ తో ఎన్నో కొత్త సినిమాలను, సిరీస్ లను అనౌన్స్ చేస్తోంది. కాగా అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 1 గత ఏడాది.. జూన్ 30 న ఆహలోకి వచ్చింది. ఈ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. హిందీలో అందరిని ఆకట్టుకున్న అఫీషియల్ చౌక్యాగిరి అనే వెబ్‌సిరీస్ ఆధారంగా తీసుకుని.. తెలుగులో అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఒక కుర్రవాడు పెద్ద కంపెనీలో జాబ్ చేయాలనుకుని ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అనేది మొదటి సీజన్ లో చూడొచ్చు.

అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ కు జోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్‌ దర్శకత్వం వహించారు. ఒక కార్పొరేట్ సంస్థలో ఒక సామాన్యుడుకు ఎదురైన సమస్యలు, అతడు వాటిని డీల్ చేసిని విధానం. ఎంతో ఎంటర్టైనింగ్ గా, సింపుల్ గా అందరికి కనెక్ట్ అయ్యేలా చూపించాడు దర్శకుడు. వీటితో పాటు ఈ సిరీస్ లో ఒక ట్రాయాంగిల్ ల‌వ్‌స్టోరీ కూడా ఉండడంతో .. మరింత ఇంట్రెస్టింగ్ గా ఈ కథ కొనసాగింది. ఇక ఈ సిరీస్ లో అరుణ్ కుమార్ గా హర్షిత్ రెడ్డి నటించారు. అన‌న్య శ‌ర్మ, షాలిని, తేజ‌స్వి మ‌దివాడ ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక.. వెంటనే ఆహలో చూసేయొచ్చు. ఇక త్వరలో అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి