iDreamPost

గ్రూప్‌ 1 టాపర్‌ భానుశ్రీ కష్టాలు! అమ్మ వినలేదు.. మాట్లాడలేదు!

  • Published Aug 18, 2023 | 12:40 PMUpdated Aug 18, 2023 | 12:40 PM
  • Published Aug 18, 2023 | 12:40 PMUpdated Aug 18, 2023 | 12:40 PM
గ్రూప్‌ 1 టాపర్‌ భానుశ్రీ కష్టాలు!  అమ్మ వినలేదు.. మాట్లాడలేదు!

గురువారం వెల్లడించిన ఏపీ గ్రూప్‌ 1 ఫలితాల్లో మొదటి ర్యాంక్‌ సాధించింది భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష. పశ్చిమ గోదావరి జిల్లాలో కాళ్ల మండలానికి చెందిన భానుశ్రీ.. అతి పిన్న వయసులోనే అనగా కేవలం 22 ఏళ్ల వయసులో గ్రూప్‌ 1లో.. అది కూడా మొదటి ప్రయత్నలోనే ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించి చరిత్ర సృష్టించింది. ప్రసుత్తం భానుశ్రీ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. యూపీఎస్సీకి ప్రిపేర్‌ అవుతన్న భాను శ్రీ.. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యి.. ప్రస్తుతం మెయిన్స్‌ కోసం ప్రిపేరవుతోంది. గ్రూప్‌ 1 తన తండ్రి కల అయితే.. యూపీఎస్సీ తన కల అని చెబుతోంది భాను శ్రీ.

ఇక పిల్లలు సాధించే విజయంలో ఆమె తల్లి పాత్ర కీలకం. ఇక భాను శ్రీ విషయంలో అది మరింత కీలకంగా మారింది. భానుశ్రీ ప్రయాణంలో అడుగడుగునా ఆమె తల్లి తోడుంది. ఈ రోజు తాను సాధించిన విజయం తనది కాదు తన తల్లిదండ్రులది అంటుంది భానుశ్రీ.. తన తల్లి తనకు సర్వస్వం.. అని చెప్తుంది. తాను గ్రూప్స్‌ సాధించడానికి కారణం తన తల్లే అని చెప్పుకొచ్చింది భానుశ్రీ.

భాను శ్రీ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. మరో విషయం ఏంటంటే.. భాను శ్రీ తల్లి.. డంబ్‌ అండ్‌ డెఫ్‌(మూగ, చెవుడు). ఆ లోపం తన బిడ్డ ప్రయాణానికి ఎక్కడా అవరోధం కానివ్వలేదు భానుశ్రీ తల్లి. మిగతా అందరి తల్లుల కంటే ఒకింత ఎక్కువగానే బిడ్డను ప్రేమించింది. తన బిడ్డ లక్ష్యం నేరవేర్చుకోవడం కోసం.. అడుగడుగునా తోడుంది. ఆఖరికి కుమార్తెతో కలిసి ఢిల్లీ కూడా వెళ్లింది భానుశ్రీ తల్లి. భాష తెలియని ప్రాంతంలో మాటలు వచ్చిన వాళ్లే.. భయంతో మూగబోతే.. భానుశ్రీ తల్లి మాత్రం బిడ్డ కోసం ధైర్యంగా ముందడుగు వేసింది. కుమార్తె చదువుకోవడానికి కావాల్సినవన్ని అమర్చి పెడుతూ.. కంటికి రెప్పలా కాపాడుకుంది. నేడు ఆ తల్లి శ్రమకు తగ్గ ఫలితం దొరికింది.

తల్లి తన కోసం పడుతున్న శ్రమ, కష్టం అర్థం చేసుకున్న భానుశ్రీ.. అందుకు తగ్గట్టుగానే కష్టపడి చదివి.. నేడు గ్రూప్‌ 1 ఫలితాల్లో.. తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంక్‌ సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తల్లే తన సర్వస్వం అని.. ఆమె లేకపోతే.. ఈ రోజు ఈ విజయం లేదని చెబుతోంది భానుశ్రీ. తన కోసం ఇంతలా కష్ట పడ్డ తల్లి రుణం.. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని చెప్పుకొచ్చింది. ఇక తన తదుపరి టార్గెట్‌ సివిల్స్‌ అని.. కచ్చితంగా సాధించి తీరతానని ధీమా వ్య​క్తం చేసింది భానుశ్రీ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి