iDreamPost

విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు పొడిగింపు!

Schools Holidays: సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వారం రోజుల ముందు నుంచి పండుగ సందడి మొదలవుతుంది.

Schools Holidays: సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వారం రోజుల ముందు నుంచి పండుగ సందడి మొదలవుతుంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు పొడిగింపు!

భారత దేశంలో హిందూ పండుగల్లో ముఖ్యమైనది సంక్రాంతి పండుగ. మూడు రోజుల ముచ్చటైన పండుగ. మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఉన్న హిందువులు ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం అంటారు.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక మకర సంక్రాంతి అంటారు. ప్రతిఏటా ఈ పండుగ జనవరి 14వ తేదీన జరుగుతుంది.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 15వ తేదీ జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని విద్యార్థులు ఎక్కువ రోజులు సెలవులు ప్రకటిస్తారన్న విషయం తెలిసిందే.   దేశ, విదేశాల్లో ఉన్నవారు తమ స్వగ్రామాలకు వచ్చి బంధుమిత్రులతో కలిసి పండగని సంతోషంగా జరుపుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటూ వార్త చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 11 వ తేదీ నుంచి జనవరి 16 వ తేదీ వరకు మాత్రమే సెలవులు ప్రకటించారు. దీనిపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి. గతంలో కనీసం పది రోజులైనా సెలవులు ఇచ్చేవారని.. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సెలవులు తగ్గించడం సరికాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.. జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు నిర్ణయించింది. 19వ తేదీన పాఠశాలల పునః ప్రారంభం అవుతాయిని తెలిపింది.

ఇదిలా ఉంటే.. పండుగ అయిపోయిన వెంటనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాలేరని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వినతుల దృష్ట్యా.. మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ.. తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు తెగ సంతోషంలో మునిగిపోయారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి